Manchu Lakshmi: తల్లి సమాధి వద్ద మంచు లక్ష్మీ..
ABN , Publish Date - Jul 22 , 2025 | 01:07 PM
తల్లి సమాధి వద్ద మంచు లక్ష్మీ (Manchu Lakshmi) అనగానే.. ఏం మాట్లాడుతున్నారు. మోహన్ బాబు (Mohan Babu) భార్య నిర్మలా దేవి బ్రతికే ఉన్నారు కదా.
Manchu Lakshmi: తల్లి సమాధి వద్ద మంచు లక్ష్మీ (Manchu Lakshmi) అనగానే.. ఏం మాట్లాడుతున్నారు. మోహన్ బాబు (Mohan Babu) భార్య నిర్మలా దేవి బ్రతికే ఉన్నారు కదా. మంచు లక్ష్మీ.. తల్లి సమాధి అంటారేంటి అనే డౌట్ అందరికీ రావచ్చు. కానీ, ఈ జనరేషన్ లో చాలామందికి తెలియని నిజం ఏంటంటే.. మోహన్ బాబుకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య విద్యాదేవికి, మోహన్ బాబుకు జన్మించిన పిల్లలే మంచు లక్ష్మీ, మంచు విష్ణు. ఆ తరువాత మోహన్ బాబు.. నిర్మలా దేవిని వివాహం చేసుకున్నాడు. వారికి జన్మించినవాడే మంచు మనోజ్.
మోహన్ బాబు తన కుటుంబాన్ని ఎంత ప్రేమిస్తాడో అందరికీ తెల్సిందే. చిన్నతనం నుంచి ముగ్గురు పిల్లలను సమానంగా పెంచాడు. అనారోగ్యంతో విద్యా దేవి మరణించడంతో.. చెల్లెలు అయిన నిర్మలా దేవి.. అక్క పిల్లలు ఎక్కడ అనాధలుగా మారతారేమో అని.. మోహన్ బాబును పెళ్లి చేసుకొని.. లక్ష్మీ, విష్ణులను కన్నబిడ్డలుగా సాకింది. మనోజ్ పుట్టాకా కూడా ముగ్గురు పిల్లలు నిర్మలాదేవికే జన్మించారా అనేంతలా చూసుకుంది. అందుకే చాలామందికి వీరు ముగ్గురు ఒక తల్లికి పుట్టిన బిడ్డలు కాదు అన్న విషయం కూడా తెలియలేదు.
కానీ, లైఫ్ ఎప్పుడు ఒకలా ఉండదు. ఆస్తుల కోసం, డబ్బు కోసం అన్నదమ్ములు కొట్టుకోవడం మొదలుపెట్టడంతో.. ఆ తారతమ్యం బయటపడింది. విష్ణు - మనోజ్ ల మధ్య గొడవలు ఏ రేంజ్ లో కొనసాగుతున్నాయో అందరికీ తెల్సిందే. ఇక మంచు లక్ష్మీ మాత్రం.. సొంత తమ్ముడు విష్ణుకు కాకుండా మనోజ్ కు సపోర్ట్ గా నిలబడింది. సొంత అక్కలా.. తమ్ముడికి పెళ్లి చేసి.. బాధ్యతగా చూసుకుంది. ఎంత పిన్ని.. తల్లిలా చూసుకున్నా కూడా కన్నతల్లి కన్నతల్లే కదా. అందుకే లక్ష్మీ సమయం దొరికినప్పుడల్లా కన్నతల్లి విద్యా దేవి సమాధి వద్దకు వెళ్లి ఆమెకు నివాళులు అర్పిస్తూ ఉంటుంది.
తాజాగా నెల్లూరు పర్యటనకు వెళ్లిన మంచు లక్ష్మీ.. నాయుడు పేటలోని తల్లి విద్యాదేవి సమాధివద్ద నివాళులు అర్పించింది. తల్లికి నమస్కరించి.. పూల మాల వేసి ఆమెను గుర్తుచేసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మంచు లక్ష్మీ ప్రతిసారి తన తల్లిని తలుచుకుంటూనే ఉంటుంది. ఆమె తనకు అన్నీ అని, చిన్నతనంలో ఆమె మొదటి టీచర్ అని ఎన్నోసార్లు చెప్పుకొచ్చింది. ఇక ఈ వీడియో చూసిన అభిమానులు.. మంచు లక్ష్మీ చాలా మంచింది అని కామెంట్స్ పెట్టుకొస్తున్నారు.
Dear Diary: కొత్త బిజినెస్ లోకి నేషనల్ క్రష్...
MM Keeravani Surprise: అప్పుడు రాజమౌళి కోసం.. ఇప్పుడు పవన్ కోసం.. ఫ్యాన్స్‌కి పండగే