Deepika Padukone: కల్కి నుంచి అవుట్.. ఎట్టకేలకు నోరువిప్పిన దీపికా

ABN , Publish Date - Oct 10 , 2025 | 06:11 PM

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణే (Deepika Padukone)ఎట్టకేలకు సైలెన్స్ ను బ్రేక్ చేసింది.

Deepika Padukone

Deepika Padukone: బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణే (Deepika Padukone)ఎట్టకేలకు సైలెన్స్ ను బ్రేక్ చేసింది. ఇన్నాళ్లుగా తనపై వస్తున్న కౌంటర్లకు ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. అసలు విషయం జోలికి వెళ్లకుండా, సింపుల్ గా కాంట్రవర్సీకి ఫుల్ స్టాప్ పెట్టేందుకు ట్రై చేసింది.


బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే ( Deepika Padukone) రెండు పెద్ద సినిమాల నుంచి తప్పుకోవడం సినీ ఇండస్ట్రీలో చర్చగా మారిన విషయం తెల్సిందే.. మొదట, సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న 'స్పిరిట్' (Spirit) సినిమా నుంచి బ్యూటీ వైదొలిగింది. ఈ ముద్దుగుమ్మ స్థానంలో మరో బ్యూటీ త్రిప్తి డిమ్రీ (Tripti Dimri) తీసుకున్నారు. దాని గురించి డిబేట్ మరిచిపోకముందే అనూహ్యంగా 'కల్కి 2898 AD' సీక్వెల్ (Kalki 2898 AD sequel) నుంచి కూడా మేకర్స్ తప్పించారు. రెండు సినిమాల నుంచి అమ్మడు ఒకే కారణంగా బయటకు వచ్చింది. ఆమె డిమాండ్స్ ను మేకర్స్ నిరాకరించడమే అందుకు కారణం.


8 గంటలే పనిచేస్తాను అని చెప్పడం, లగ్జరీ హోటల్స్ లో బస.. తనతోపాటు తన స్టాఫ్ కు కూడా అంతే లగ్జరీబస కావాలని డిమాండ్ చేయడం.. ఇవన్నీ మేకర్స్ చేయలేము అని చెప్పడంతో ఆమె సినిమాల నుంచి వైదొలిగింది. ఇక దీపికా 8 గంటల పనితీరుపై చాలామంది నటీనటులు విమర్శించారు. కానీ, దీపికా ఎక్కడా తగ్గేది లేదు అంటూ దానిమీద నిలబడింది. ఈ రెండు సినిమాల విషయంలో దీపికా చాలా రోజులు మాట్లాడలేదు. అందరూ ఆమె ఏం చెబుతుందా అని చాలారోజుల నుంచి ఎదురుచూస్తూ వస్తున్నారు.. ఎట్టకేలకు దీపికా ఈ విషయమై రియాక్ట్ అయ్యింది.


రెండు పెద్ద సినిమాల నుంచి బయటకు రావడంపై తాజాగా ఒక ఇంటర్వ్యూలో దీపికా మాట్లాడింది. తాను ఈ విషయాన్ని పెద్దది చేయదలుచుకోలేదని చెప్పింది.. చాలా మంది హీరోలు వారానికి ఐదు రోజులు.. రోజుకు 8 గంటలు పనిచేస్తారని తెలిపింది. అంతేకాకుండా వారు వీకెండ్స్‌లో పని చేయరని చెప్పింది. అయితే ఇప్పుడు చాలా మంది హీరోయిన్లు, పిల్లలకు తల్లులు అయ్యాక 8 గంటలు పనిచేస్తున్నారని, కానీ అది ఎవరూ పట్టించుకోరని వాపోయింది. అందరూ తననే టార్గెట్ చేస్తున్నారని చెప్పుకొచ్చింది. తన కెరీర్‌లో ఇలాంటి సమస్యలు చాలాసార్లు ఎదురయ్యాయని గుర్తు చేసింది. రెమ్యూనరేషన్ విషయంలో కూడా తనకు సరిపడా ఇవ్వలేదని, ఇప్పటివరకు ఇలాంటి సమస్యలను నిశ్శబ్దంగా ఎదుర్కున్నానని తెలిపింది. ప్రస్తుతం దీపికా వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Funkey Teaser: ఫంకీ టీజర్.. ఈసారి జాతిరత్నాలును మించి

Sashivadane Review: శశివదనే మూవీ ఎలా ఉందంటే

Updated Date - Oct 10 , 2025 | 06:11 PM