సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Aishwarya Rajesh: సంక్రాంతికి వస్తున్నాం తర్వాత కొత్త సినిమా...

ABN, Publish Date - Nov 10 , 2025 | 11:47 AM

తిరువీర్, ఐశ్వర్య రాజేశ్ క్రేజీ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతోంది. 'శివం భజే' చిత్ర నిర్మాత ఈ జంటతో ఓ సినిమా నిర్మిస్తున్నారు.

Tiruveer, Aishwarya Rajesh New movie

తెలుగమ్మాయి అయిన ఐశ్వర్య రాజేశ్‌ (Aishwarya Rajesh) తమిళనాడులో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అక్కడ హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ కూడా చేసింది. తెలుగులో పలు చిత్రాలలో నటించినా... ఆమెకు గ్రాండ్ సక్సెస్ ను అందించిన సినిమా మాత్రం ఈ యేడాది సంక్రాంతికి వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమానే. ఈ సినిమా ఏకంగా రూ. 300 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసి, ఈ యేడాది ఆ సీజన్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇదిలా ఉంటే... సహజనటుడు తిరువీర్ (Thiru Veer) గత కొంతకాలంగా కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు. తాజాగా తిరువీర్ నటించిన 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. లాస్ట్ వీకెండ్ విడుదలైన సినిమాలలో వినోదానికి పెద్ద పీటను వేసిన ఈ సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. దాంతో నిదానంగా కలెక్షన్స్ కూడా పెరుగుతున్నాయి. విశేషం ఏమంటే ఇప్పుడు తిరువీర్, ఐశ్వర్య రాజేశ్ జంటగా ఓ కొత్త సినిమా మొదలైంది.


గతంలో 'శివమ్ భజే' (Shivam Bhaje) చిత్రాన్ని రూపొందించిన గంగా ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఇప్పుడు తిరువీర్, ఐశ్వర్యా రాజేష్‌ జంటగా ఓ సినిమాను ప్రారంభించింది. దీనికి సంబంధఙంచిన పూజా కార్యక్రమాలు ఆదివారం హైదరాబాద్ లో జరిగాయి. చిత్ర యూనిట్ సభ్యులు ఇందులో పాల్గొన్నారు. భరత్ దర్శన్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ సినిమాను మహేశ్వర రెడ్డి మూలి నిర్మిస్తున్నాడు. 'రజాకార్, పొలిమేర' చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించిన సిహెచ్. కుషేందర్ దీనికి సినిమాటోగ్రాఫర్ కాగా, ఎం.ఎం. కీరవాణి (MM Keeravani) శిష్యుడు భరత్ మంచిరాజు సంగీతం అందిస్తున్నాడు. 'బలగం' ఫేమ్ తిరుమల ఎం తిరుపతి ఆర్ట్ డైరెక్టర్ గా, 'క' మూవీ ఎడిటర్ శ్రీవరప్రసాద్ కూర్పరిగా వ్యవహరించబోతున్నారు. ఇక 'స్వయంభూ' చిత్రానికి పని చేస్తున్న అను రెడ్డి అక్కటి ఈ మూవీకి కాస్ట్యూమ్ డిజైనర్. ఈ సినిమాకూ పూర్ణాచారి లిరిక్స్ అందిస్తున్నారు. ఈ నెల 19 నుండి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ సినిమాను నాలుగు దక్షిణాది భాషల్లోనూ ఒకేసారి విడుదల చేస్తామని మేకర్స్ చెబుతున్నారు.

Also Read: Ram Gopal Varma: అబ్బా ఆర్జీవీ.. చిరంజీవికి క్ష‌మాప‌ణల వెనుక మ‌ర్మం ఇదా!

Also Read: Premante: శ్రీలీల.. చేతుల మీదుగా పెళ్లి షురూ

Updated Date - Nov 10 , 2025 | 11:48 AM