Premante: శ్రీలీల.. చేతుల మీదుగా పెళ్లి షురూ
ABN , Publish Date - Nov 10 , 2025 | 09:37 AM
ప్రియదర్శి, ఆనంది జంటగా తెరకెక్కిన చిత్రం ‘ప్రేమంటే’ నుంచి పెళ్లి పాట ‘పెళ్లి షురూ’ పాటను విడుదల చేశారు.
ప్రియదర్శి (Priyadarshi), ఆనంది (Anandhi)జంటగా తెరకెక్కిన చిత్రం ‘ప్రేమంటే’ (Premante). శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ బేనర్‌పై పుస్కూర్ రామ్‌మోహన్ రావు, జాన్వీ నారంగ్ నిర్మించారు. రానా దగ్గుబాటి సమర్పిస్తున్నారు. ఈనెల 21న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్రం నుంచి పెళ్లి పాట ‘పెళ్లి షురూ’(Pelli Shuru)ను హీరోయిన్ శ్రీలీల (Sreeleela) చేతుల మీదుగా విడుదల చేశారు.
వివాహ వేడుకల ఉత్సాహాన్ని, సంబరాన్ని తెలిపేలా ఉన్న ఈ పాటను శ్రీమణి రాశారు. దీపక్ బ్లూ, శ్రేయా ఘోషల్ ఆలపించగా, లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. ఈ పాట నూతన జంట భావోద్వేగాలను అందంగా ఆవిష్కరిస్తుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి ఎడిటర్: రాఘవేంద్ర తిరుణ్, సినిమాటోగ్రఫీ: విశ్వనాథ్ రెడ్డి.