Anil Ravipudi: ప్రమోషన్స్‌లో.. అనిల్ రూటే సపరేటూ

ABN , Publish Date - Oct 10 , 2025 | 07:40 PM

ఈ మధ్యకాలంలో సినిమా ఎవరిది అనేది ముఖ్యం కాదు. దానికి ప్రమోషన్స్ ఎలా చేస్తున్నారు అనేది మాత్రమే ముఖ్యం.

Anil Ravipudi

Anil Ravipudi: ఈ మధ్యకాలంలో సినిమా ఎవరిది అనేది ముఖ్యం కాదు. దానికి ప్రమోషన్స్ ఎలా చేస్తున్నారు అనేది మాత్రమే ముఖ్యం. ఒక సినిమాను ఎన్నికోట్లు పెట్టి తీసినా దానిని ప్రేక్షకుల మధ్యలోకి తీసుకెళ్లకపోతే థియేటర్ కు వచ్చేవారు ఉండరు. అందుకే మేకర్స్ సినిమాకు ఎంత ఖర్చు పెడుతున్నారో.. దానికి రెట్టింపు ప్రమోషన్స్ కు పెడుతున్నారు. ఇక టాలీవుడ్ ప్రమోషన్స్ చేయడంలో డైరెక్ట అనిల్ రావిపూడి రూటే సపరేటూ అని చెప్పొచ్చు.


అనిల్ రావిపూడి సినిమా మొదలైనప్పటినుంచి ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాడు. అది కూడా చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తాడు. సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయినవారితో.. వ్యంగ్యంగా వీడియోలు చేయించి మరీ సినిమాపై హైప్ క్రియేట్ చేయిస్తాడు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు అలానే చేసి సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు మన సంకర వరప్రసాద్ గారు సినిమాకు అదే ఫార్ములాను వాడేస్తున్నాడు.


మెగాస్టార్ చిరంజీవి , నయనతార జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మన శంకర వరప్రసాద్ గారు. ఈ సినిమా సంక్రాంతి బరిలో దిగుతుంది. దీంతో ఇప్పటి నుంచే అనిల్ ప్రమోషన్స్ మొదలుపెట్టేశాడు. ఈమధ్యనే ఈ చిత్రం నుంచి మీసాల పిల్లా అంటూ ఒక సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. అది ఎంత సెన్సేషన్ సృష్టించిందో అందరికీ తెల్సిందే. ఇక ఇప్పుడు మీసాల పిల్ల ఫుల్ సాంగ్ రిలీజ్ డేట్ ను కూడా ఎంతో డిఫరెంట్ గా చెప్పుకొచ్చాడు.


సంక్రాంతికి వస్తున్నాం ఫేమ్ బుల్లిరాజుని రంగంలోకి దింపి మీసాల పిల్ల ఫుల్ సాంగ్ ఎప్పుడు అని అడిగించడం, బుల్లిరాజుతో మెగాస్టార్ స్టెప్పులు వేయించి.. రిలీజ్ డేట్ చెప్పడం ఆకట్టుకుంటుంది. అక్టోబర్ 13 న మీసాల పిల్లా ఫుల్ సాంగ్ రిలీజ్ కానుందని అనిల్ చెప్పుకొచ్చాడు. మరి ఈ సాంగ్ ఇండస్ట్రీని ఏ రేంజ్ లో ఊపేస్తుందో చూడాలి.

The Last Bus: సలార్‌ మ్యూజిక్‌ 'ద లాస్ట్ బస్' కాంట్రవర్సీ

Deepika Padukone: కల్కి నుంచి అవుట్.. ఎట్టకేలకు నోరువిప్పిన దీపికా

Updated Date - Oct 10 , 2025 | 08:07 PM