Thalapathy Vijay: తమన్ పై నమ్మకం...

ABN , Publish Date - Aug 22 , 2025 | 04:15 PM

విజయ్ పొలిటికల్ పార్టీ 'టివికె' కు యాంథమ్ ను సమకూర్చిన ఎస్. థమన్ ఇప్పుడు ఆ పార్టీ సిద్ధాంతాలను తెలియచేస్తూ మరో పాటకు స్వరాలు అందించాడు. ఈ పాటకు విజయ్ ఫ్యాన్స్, పార్టీ కార్యకర్తలు ఫిదా అయిపోయారు.

Thalapathi Vijay

ప్రస్తుతం తమిళ చిత్రసీమలో ఎ.ఆర్. రెహమాన్ (A.R. Rehman) తో పాటు అనిరుథ్‌ (Anirudh), జీవీ ప్రకాశ్‌ కుమార్ (GV Prakash Kumar), సామ్ సి.ఎస్. (Sam CS) హవా సాగుతోంది. అయితే తెలుగువారైన దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad), ఎస్. థమన్ (S. Thaman) కూడా తమ సత్తాను చాటుతున్నారు. విశేషం ఏమంటే... తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ ను కాదని విజయ్ తన పార్టీకి తమన్ సేవలనే అధికంగా ఉపయోగించుకుంటున్నాడు. గత యేడాది పార్టీ యాంథమ్ ను తమన్ తోనే విజయ్ చేయించుకున్నాడు. దానికి మంచి అప్లాజ్ లభించింది. దాంతో ఇటీవల మధురైలో జరిగిన పబ్లిక్ ఫంక్షన్ కోసం మరోసారి తమన్ తో పాట చేయించుకున్నాడు విజయ్.


విజయ్ గొప్పతనాన్ని చాటుతూ, తమిళ సంస్కృతిని తెలియచేస్తూ, విజయ్ పార్టీ ఏ యే వర్గాలకు ఏం చేయబోతోందో తెలియచేస్తూ, సాగిన ఈ పాట ఆద్యంతం అందరినీ ఆకట్టుకుంటోంది. నిజానికి విజయ్ అడగాలే కానీ రెహ్మాన్, జీవీ ప్రకాశ్ కుమార్, అనిరుథ్‌ వంటి వాళ్ళు హ్యాపీగా పాట చేసి ఇస్తారు. కానీ వారెవ్వరినీ కాదని తమన్ తో ఈ రెండు పాటలు చేయించుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.


విశేషం ఏమంటే... తమన్ కూడా రెగ్యులర్ సినిమాలకు ఇచ్చే విధంగా కాకుండా... పార్టీ సిద్థాంతాన్ని ఆకళింపు చేసుకుని సాహిత్యాన్ని హైలైట్ చేస్తూ స్వరాలను సమకూర్చాడు. దాంతో ఈ పాటను పార్టీ అధికారిక యూట్యూబ్ ఛానెల్ లో పెట్టిన దగ్గర నుండి విశేషంగా వ్యూస్ ను, లైక్స్ ను దక్కించుకుంటోంది. తమన్ కాకుండా వేరే ఎవరైనా అయితే ఈ పాట ఈ స్థాయిలో ఉండేది కూడా కాదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతా చేస్తే... తన కెరీర్ లో తమన్ విజయ్ నటించిన ఒకే ఒక్క సినిమా 'వారిసు' (వారసుడు)కు మాత్రమే సంగీతం అందించాడు.

Also Read: Anil Ravipudi: సంక్రాంతిలోపు ఒక్కొక్క సర్‌ప్రైజ్‌ చూస్తారు..

Also Read: Ghaati: డిస్ట్రిబ్యూటర్ గా యశ్ మదర్

Updated Date - Aug 22 , 2025 | 04:16 PM