Jana Nayagan: విజయ్.. జన నాయకుడు ఫస్ట్ లుక్ వచ్చేసింది! ఆ తెలుగు సినిమాలా ఉందేంటి
ABN , Publish Date - Jun 22 , 2025 | 07:24 AM
విజయ్ హీరోగా నటిస్తున్న చిత్రం జన నాయగన్. ఏడాదిగా చితత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.
తమిళ స్టార్ విజయ్ (Vijay) హీరోగా నటిస్తున్న చిత్రం జన నాయగన్. దాదాపు ఏడాదిగా చితత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాపై తమిళనాట భారీ అంచనాలే ఉన్నాయి. దళపతి 69 (Thalapathy 69)వ సినిమాగా విజయ్ నటించే అఖరు సినిమాగా పిలవబడుతున్న ఈ మూవీని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద వెంకట్ కే నారాయణ భారీ ఎత్తున ఈ మూవీని నిర్మిస్తున్నారు. గతంలో అజిత్‌తో తునీవు, వాలిమై, కార్తీతో ఖాకీ వంటి భారీ చిత్రాలను తెరకెక్కించిన హెచ్ వినోద్ (H Vinod) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.
అయితే చాలా రోజుల తర్వాత ఈ చిత్రం నుంచి ఓ అప్డేట్ వచ్చింది. ఆదివారం విజయ్ జన్మదినం సందర్భంగా సిఇనమా నుంచి రోరింగ్ లుక్ పోస్టర్, వీడియో విడుదల చేశారు. దీంతో తమిళనాట విజయ్ అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఇదిలాఉంటే మొదటి నుంచి ఈ చిత్రం తెలుగులో బాలకృష్ణ(Nandamuri Balakrishna) భగవంత్ కేసరి చిత్రానికి రీమేక్ అని ప్రచారం జరగగా అలాంటిదేమీ లేదని మేకర్స్ చెబుతూ వచ్చారు.
కానీ తాజాగా విడుదల చేసిన లుక్, వీడియో చూస్తే చాలా వరకు భగవంత్ కేసరిని తలపించేలా ఉండడం ఇప్పుడు చర్చలకు దారి తీస్తుంది. ఇప్పటికే విడుదల చేసిన విజయ్ వీడియో, భగవంత్ కేసరి (Bhagavanth Kesari) వీడియోను పక్కపక్కనే పెట్టి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మరి ఇప్పుడు మేకర్స్ ఏం చెబుతారో అనేది ఆసక్తికరంగా మారింది. కాగా ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 9 2026న తమిళంతో పాటు సౌత్ భాషల్లోనూ విడుదల చేయనుండగా తెలుగులో జన జన నాయకుడిగా విడుదల కానుంది.