సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Coolie Trailer: దుమ్మురేపిన దేవా...

ABN, Publish Date - Aug 02 , 2025 | 08:20 PM

సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'కూలీ' మూవీ ట్రైలర్ రానే వచ్చింది. మరి అది ఎలా ఉందో తెలుసుకుందామా...

Coolie Trailer

సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) లేటెస్ట్ మూవీ 'కూలీ' (Coolie) ట్రైలర్ వచ్చేసింది. రజనీతో మొదటిసారి జత కట్టిన లోకేశ్ కనకరాజ్ అందరూ అనుకున్నట్టే మెస్మరైజ్ చేయబోతున్నాడని ట్రైలర్ చూస్తుంటే అర్థమౌతోంది. ఒక్క రజనీకాంత్ మాత్రమే కాదు... ఇందులోని ప్రధాన పాత్రధారులంతా ఈ ట్రైలర్ లో కనిపించడం... వాళ్ళ ఎంట్రీ తర్వాతే రజనీ ఎంట్రీ జరగడం విశేషం. ఆమిర్ ఖాన్ సైతం యాక్షన్ మోడ్ లో కనిపించేశాడు.

సహజంగా ఓ చిన్న ఇన్సిడెంట్ చుట్టూనే లోకేశ్‌ కనకరాజ్ కథను నడిపినట్టు పైకి కనిపించినా... ఐస్ బర్గ్ మాదిరి దాని లోతు చాలానే ఉంటుంది. 'కూలీ' సైతం అలాంటి కథే అని తెలుస్తోంది. పైకి కనిపించని ఇంకేదో వ్యవహారం జరుగుతోందంటూ ఓ పాత్ర చెబుతుంది కూడా. 'కూలీ' చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్న నాగార్జున, ఉపేంద్ర పాత్రలకు ఉన్న ప్రాధాన్యాన్ని ఈ ట్రైలర్ లో కొంత అంచనా వేయొచ్చు... అలానే ప్రతినాయకుడిగా కనిపించే సౌబిన్ షాహిల్ లోని క్రూరత్వాన్ని కాస్తంత రుచి చూపించారు. ఆ మధ్య వచ్చిన పూజా హెగ్డే సాంగ్ లో ఓ కమెడియన్ లాగా సౌబిన్ తో స్టెప్పులేయించినా... అతనిలోని అసలు నటుడు ఈ ట్రైలర్ లో వికటాట్టహాసం చేశాడు. సత్యరాజ్ కూతురుగా శ్రుతీహాసన్ నటించిందని అర్థమౌతోంది. తన తండ్రిని రక్షించమని దేవాను ఆమె కోరినప్పుడు 'నీకు తండ్రి మాత్రమే... నాకు ప్రాణస్నేహితుడు' అతను రంగంలోకి దిగడంతో అసలు విధ్వంసం మొదలవుతుంది. 'కూలీ' మూవీకి 'ఎ' సర్టిఫికెట్ ఎందుకు వచ్చిందో... ఈ ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. ఇంత సీరియస్, యాక్షన్ మూవీలో సైతం రజనీకాంత్ కొసమెరపుగా ఓ ఫ్రాంక్ చేసి... దీన్ని చూస్తున్న వాళ్ళు హాయిగా నవ్వుకునేలా చేశాడు.


రజనీకాంత్ సినిమా అంటేనే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుథ్‌ రవిచందర్ విశ్వరూపం చూపిస్తాడు. ఇందులోనూ తన సత్తాను మరోసారి చాటాడు. కేవలం బీజీఎం మాత్రమే కాకుండా పాటలూ అదరగొట్టాడు. ట్రైలర్ లో 'అడుగు పెడితే విజిలే' అంటూ ఫ్యాన్ మూమెంట్ ను లింక్ చేశాడు. గిరీష్‌ గంగాధరన్ విజువల్స్ రిచ్ గా ఉన్నాయి. ఇతర టెక్నీషియన్స్ సైతం రజనీ మూవీ కోసం ప్రాణం పెట్టేశారని పిస్తోంది. సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ కు రజనీకాంత్ అంటే ప్రత్యేక అభిమానం. రెండేళ్ళ క్రితం 'జైలర్'ను నిర్మించి, రజనీకాంత్ ను తిరిగి సక్సెస్ ట్రాక్ లోకి తీసుకొచ్చింది కూడా కళానిధి మారనే! 'కూలీ' ట్రైలర్ చూసినప్పుడు 'జైలర్' సక్సెస్ ఖచ్చితంగా రిపీట్ అవుతుందనే భావన కలుగుతోంది. ఏదేమైనా... రజనీకాంత్ తో పాటు లోకేష్ కనకరాజ్ కూ ఉన్న ఫ్యాన్స్ బేస్... ఈ మూవీని సూపర్ హిట్ చేయడం ఖాయమనిపిస్తోంది. ఓ రకంగా 'వార్ -2'కు 'కూలీ' దేవా గట్టి పోటీనే ఇస్తాడనిపిస్తోంది. ఈ సినిమాను తెలుగులో సురేశ్‌ బాబు, దిల్ రాజు, సునీల్ నారంగ్, భరత్ నారంగ్ సంయుక్తంగా రిలీజ్ చేస్తున్నారు.

ట్రైలర్ విడుదలైన మరుక్షణం నుండి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. రజనీకాంత్ గత చిత్రాలకు ఉన్న రికార్డులను 'కూలీ' తిరగరాస్తుందనే అభిప్రాయాన్ని నెటిజన్స్ వ్యక్తం చేస్తున్నారు... రజనీకాంత్ స్వాగ్ చూసి... మెస్మరైజ్ అవుతున్నారు. రజనీకాంత్ కు తోడు పలు పరభాష నాయకులూ ఇందులో ఉండటం పెద్ద ప్లస్ పాయింట్ గా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి పాన్ ఇండియాను టార్గెట్ చేసిన 'కూలీ' ఎంత రాబడతాడో చూద్దాం.

Also Read: RR Dhruvan: 'మిత్ర మండలి' నుంచి సెకండ్ సింగిల్ వచ్చేసింది...

Also Read: Niharika Konidela: రెండో పెళ్లికి సిద్దమైన మెగా డాటర్

Updated Date - Aug 02 , 2025 | 08:33 PM