RR Dhruvan: 'మిత్ర మండలి' నుంచి సెకండ్ సింగిల్ వచ్చేసింది

ABN , Publish Date - Aug 02 , 2025 | 07:05 PM

ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలు పోషిస్తున్న సినిమా 'మిత్రమండలి'. ఈ చిత్రంతో సోషల్ మీడియా సంచలనం నిహారిక ఎన్. ఎం. తెలుగు తెరకు పరిచయమవుతోంది. ఈ సినిమా నుండి సెకండ్ సింగిల్ రిలీజ్ అయ్యింది.

Mitramandali Movie

ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ (Bunny Vas) బి. వి. వర్క్స్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'మిత్ర మండలి' (Mithra Mandali). అభిరుచి గల నిర్మాతలు కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంతో సోషల్ మీడియా సంచలనం నిహారిక ఎన్. ఎం. తెలుగు తెరకు పరిచయమవుతోంది. ఈ చిత్రంతో విజయేందర్ ఎస్ దర్శకుడిగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన 'కత్తందుకో జానకి' పాట ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా సెకండ్ సింగల్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.


'మిత్రమండలి' కోసం ఆర్. ఆర్. ధృవన్ (RR Dhruvan) స్వరపరిచిన ఈ పాటకు ఆర్.ఆర్. ధృవన్, విజయేందర్ ఎస్ సంయుక్తంగా సాహిత్యం అందించారు. తేలికైన ఇంగ్లీష్ పదాలతో సరదా సరదాగా ఈ గీత రచన ఉంది. 'వై దిస్ కొలవెరి' శైలిలో సాగిన 'స్వేచ్ఛ స్టాండు' గీతం.. ఆ పాట శైలిలోనే సోషల్ మీడియాలో సంచలనం సృష్టించేలా ఉంది.

ధనుంజయ్ సీపాన, ఆర్. ఆర్. ధృవన్ గానం ఈ పాటను ఉత్సాహభరితంగా మార్చింది. కథానాయిక దృష్టిలో పడటం కోసం కథానాయకులు వచ్చీరాని ఇంగ్లీష్ పదాలతో పాట పడటం సరదాగా ఉంది. ముఖ్యంగా ఈ తరం శ్రోతలకు నచ్చేలా 'స్వేచ్ఛ స్టాండు' గీతం సాగింది. 'వెన్నెల' కిషోర్, సత్య, వి.టి.వి. గణేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సహ నిర్మాతగా సోమరాజు పెన్మెత్స, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా రాజీవ్ కుమార్ రామా వ్యవహరిస్తున్నారు.

Also Read: Aditya Hasan: సక్సెస్ ఫుల్ కాంబోతో 'లిటిల్ హార్ట్స్'

Also Read: Niharika Konidela: రెండో పెళ్లికి సిద్దమైన మెగా డాటర్

Updated Date - Aug 02 , 2025 | 07:05 PM