సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Trimukha Movie: సన్నీ లియోన్ మూవీ నుండి సాంగ్

ABN, Publish Date - Dec 22 , 2025 | 12:35 PM

సన్నీలియోన్ ప్రధాన పాత్ర పోషించిన 'త్రిముఖ' చిత్రం నుండి ఐటమ్ సాంగ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో జనవరి 2న విడుదల చేయబతున్నారు మేకర్స్.

Trimukha Movie

వరల్డ్ ఫేమస్ పోర్న్ స్టార్ సన్నీలియోన్ (Sunny Leone) కీలక పాత్ర పోషించిన సినిమా 'త్రిముఖ' (Trimukha). యోగేశ్‌ (Yogesh), సాహితీ దాసరి (Sahithi Dasari), ఆకృతి అగర్వాల్ (Akrithi Agarwal) ఇందులో ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. రాజేశ్‌ నాయుడు దర్శకత్వంలో శ్రీదేవి మద్దాలి, రమేశ్‌ మద్దాలి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వినోద యాజమాన్య సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుండి తాజాగా న్యూయర్ గిఫ్ట్ గా 'గిప్పా... గిప్పా' అనే పాటను మేకర్స్ విడుదల చేశారు. ఇది తమ సినిమా నుండి ప్రేక్షకులకు ఇస్తున్న అసలు సిసలు బ్లాస్ట్ బొనంజా అనే వారు తెలిపారు. ఈ పాటను గణేశ్‌ రాయగా, సాహితి చాగంటి పాడారు. దీనికి బాబీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ఈ చిత్రాన్ని జనవరి 2న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయబోతున్నామని అన్నారు. ఇందులో ఇతర ప్రధాన పాత్రలను సీఐడీ ఆదిత్య శ్రీవాస్తవ్, మొట్ట రాజేంద్రన్, ఆశు రెడ్డి, ప్రవీణ్, షకలక శంకర్, సుమన్, రవి ప్రకాష్, జీవా, సమ్మెట గాంధీ, జెమినీ సురేష్ తదితరులు పోషించారు.

Also Read: Chiru - Venky: చిరు, వెంకీ కలిసి స్టెప్‌ వేస్తే.. దర్శకుడు అదిరిపోయే అప్‌డేట్‌

Also Read: Ravi Teja: నో రెమ్యునరేషన్‌.. రవితేజపై ఆ మాట పోగొట్టడానికే...

Updated Date - Dec 22 , 2025 | 12:35 PM