Chiru - Venky: చిరు, వెంకీ కలిసి స్టెప్ వేస్తే.. దర్శకుడు అదిరిపోయే అప్‌డేట్
ABN , Publish Date - Dec 22 , 2025 | 10:26 AM
మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్ కలిసి స్టెప్పేస్తే ఎలా ఉంటుంది.. ఆ క్రేజే వేరుగా ఉంటుంది. ఇ ద్దరు హీరోల అభిమానులకు ఫుల్ మీల్స్ వడ్డించినట్లే.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), విక్టరీ వెంకటేశ్ (Venkatesh) కలిసి స్టెప్పేస్తే ఎలా ఉంటుంది..
ఆ క్రేజే వేరుగా ఉంటుంది.
ఇద్దరు హీరోల అభిమానులకు ఫుల్ మీల్స్ వడ్డించినట్లే.
అందుకు రెడీ అయిపోమంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. చిరంజీవి, నయనతార జంటగా అనిల్ దర్శకత్వం వహిస్తున్న‘మన శంకరవరప్రసాద్‌గారు’ ( Mana Shankaravaraprasad Garu) చిత్రం ఈ సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కానుంది. ఇందులో విక్టరీ వెంకటేశ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. చిరంజీవి, వెంకటేశ్ మధ్య సన్నివేశాలు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటాయని ఇప్పటికే టీమ్ చెప్పింది. అయితే ఇప్పుడు మరో సర్‌ప్రైజ్ ఇచ్చారు దర్శకుడు. చిరు, వెంకీ ఇద్దరూ ఈ సినిమాలో ఓ పాటకు కాలు కదిపారట. ఉర్రూతలూగించే ఆ పాటను త్వరలోనే రిలీజ్ చేస్తామని డైరెక్టర్ అనిల్ ప్రకటించారు.
‘శంబాల’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న అనిల్ తాజాగా ఈ అప్‌డేట్ ఇచ్చారు. చిరు, వెంకీ కలిసి ఒకే సినిమాలో ఉన్నారంటేనే క్రేజ్. ఇప్పుడది పదింతలు అయింది. ఇద్దరినీ కలిపి తెరపై చూడబోతుండటం మెగా అభిమానులకు పెద్ద పండుగలా ఉంది. ఫుల్ ఖుష్ అవుతూ, థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని చెబుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ‘మీసాల పిల్ల’, ‘శశిరేఖ’ పాటలు ఎంతగా ఆకట్టుకున్నాయో తెలిసిందే! ‘మీసాల పిల్ల’ 90 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. ‘శశిరేఖ’ సైతం యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ రెండు పాటల్లోనూ చిరు, నయన్ ఆడిపాడి సందడి చేశారు. రాబోయే సాంగ్‌లో చిరు, వెంకీ ఇద్దరూ స్టెప్స్ వేయనున్నారని ఆయన అన్నారు. షైన్ స్క్రీన్స్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు.