Samantha: పెళ్లి అయ్యి వారం కూడా కాలేదు.. అప్పుడే మొదలుపెట్టిన సమంత
ABN , Publish Date - Dec 05 , 2025 | 06:11 PM
డిసెంబర్ మొదలు అయిన రోజునే సమంత(Samantha) ఇండస్ట్రీ మొత్తానికి షాక్ ఇచ్చింది. డైరెక్టర్ రాజ్ నిడిమోరు (Raj Nidimoru)ని రెండో వివాహం చేసుకొని అందరూ ఆశ్చర్యపోయేలా చేసింది.
Samantha: డిసెంబర్ మొదలు అయిన రోజునే సమంత(Samantha) ఇండస్ట్రీ మొత్తానికి షాక్ ఇచ్చింది. డైరెక్టర్ రాజ్ నిడిమోరు (Raj Nidimoru)ని రెండో వివాహం చేసుకొని అందరూ ఆశ్చర్యపోయేలా చేసింది. కోట్ల ఆస్తి ఉన్నా చాలా సింపుల్ గా ఈషా ఆశ్రమంలో సింపుల్ గా సామ్ - రాజ్ ఒక్కటయ్యారు. ఇక అప్పటి నుంచి ఆమెపై ట్రోల్స్ వస్తూనే ఉన్నాయి. సామ్ పెళ్లి ఫోటోలు ట్రెండింగ్ గా నిలుస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ సామ్ సోషల్ మీడియా హాట్ టాపిక్ గానే ఉంది. ఆమె ఏ పోస్ట్ పెట్టినా నిమిషాల్లో వైరల్ గా మారుతుంది. ఇక పెళ్లి తరువాత సామ్.. విదేశాల్లో హనీమూన్ లో ఉంటుంది. ఏ బీచ్ ఒడ్డునో.. లేక ఎడారిలోనో రాజ్- సామ్ ఫోటోలు పెడతారేమో అని ఎదురుచూస్తుంటే అమ్మడు మాత్రం సెట్ లో అడుగుపెట్టి మరోసారి షాక్ ఇచ్చింది.
సిటాడెల్ వెబ్ సిరీస్ కన్నా ముందు సమంత ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అనే ప్రొడక్షన్ హౌస్ ను మొదలుపెట్టింది. ఇందులో మొదటి సినిమాగా మా ఇంటి బంగారం ను అనౌన్స్ చేసింది. ఏడాది దాటిపోయినా ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తున్నారు అనేది చెప్పలేదు సామ్. ఇక మధ్యలో ఈ బ్యానర్ లో శుభం అనే సినిమా తెరకెక్కించి అదే మొదటి సినిమాగా రిలీజ్ చేశారు. ఈ సినిమా పాజిటివ్ టాక్ తో పాటు మంచి కలక్షన్స్ కూడా రాబట్టింది. ఇప్పుడు మొదటి సినిమాగా అనౌన్స్ చేసిన మా ఇంటి బంగారం రెండో సినిమాగా పట్టాలెక్కుతున్నట్లు తెలిపింది.
ఈ మధ్యనే మా ఇంటి బంగారం పూజా కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. సామ్ బెస్ట్ ఫ్రెండ్ అయిన నందిని రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుంది. గుల్షన్ దేవయ్య, సమంత కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పెళ్లి అయ్యి వారం కూడా కాకముందే సామ్.. బంగారం షూట్ లో ప్రత్యేక్షమయ్యింది. అందుకు సంబంధించిన ఫోటోను సామ్ అభిమానులతో పంచుకుంది. ఆ ఫొటోలో మేకప్ రూమ్ లో షాట్ కి రెడీ అవుతున్న సామ్.. పక్కన నందిని రెడ్డి నవ్వుతూ మాట్లాడడం కనిపిస్తుంది. ఇంకా చేతికి గోరింటాకుతోనే సామ్ కనిపించింది. దీంతో హనీమూన్ ని కూడా పక్కన పెట్టి సామ్ పని మీద దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. మరి బంగారం.. హనీమూన్ పక్కన పెట్టి మరీ చేస్తున్న మా ఇంటి బంగారం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.