Actress Pragathi: ఏసియన్ పవర్ లిఫ్టింగ్ పోటీలకు.. నటి ప్రగతి

ABN , Publish Date - Dec 05 , 2025 | 06:42 PM

నటి ప్రగతి పవర్ లిఫ్టింగ్ పోటీలలో పాల్గొనేందుకు టర్కీ వెళ్ళింది. ఇప్పటికే జాతీయ స్థాయిలో బంగారు పతకాలను అందుకున్న ప్రగతి ఇప్పుడు ఏసియన్ కాంటినెంట్ లో తన సత్తాను చాటబోతోంది.

Pragathi Mahavadi

ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి, తన నటనతో కుటుంబ ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకుంది నటి ప్రగతి (Pragathi). ఆమె నటిగా ఎంత ప్రతిభావంతురాలో, పవర్ లిఫ్టింగ్ లోనూ అంతకంటే ఎక్కువ టాలెంటెడ్ ను ప్రదర్శిస్తుంటారు. జిల్లా, రాష్ట్ర, దక్షిణ భారత దేశ స్థాయితో పాటు జాతీయ స్థాయిలోనూ ప్రగతి అనేక మెడల్స్ ను అందుకుంది.

ఈ ఏడాది హైదరాబాద్ డిస్ట్రిక్ట్ లెవెల్, తెలంగాణ స్టేట్ లెవెల్ పోటీల్లో గోల్డ్ మెడల్ గెల్చుకున్న ప్రగతి, కేరళలో జరిగిన నేషనల్ లెవెల్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లోనూ బంగారు పతకం గెల్చుకుంది. 2023 నుండి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొనడం ప్రారంభించిన ప్రగతి... గత రెండేళ్లుగా తెలంగాణ, ఏపీతో పాటు జాతీయ స్థాయిలో పవర్ లిఫ్టింగ్ లో వరుసగా గోల్డ్ మెడల్స్ గెల్చుకుంటూ సత్తా చాటుతోంది. డిసెంబర్ 6న టర్కీలో జరుగుతున్న ఏసియన్ పవర్ లిఫ్టింగ్ గేమ్స్ లో ప్రగతి పాల్గొంటోంది. మరి జాతీయ స్థాయిలో సత్తా చాటిన ప్రగతి ఏసియన్ కాంటినెంట్ లోనూ బంగారు పతకాన్ని ఒడిసి పడుతుందేమో చూద్దాం.

Updated Date - Dec 05 , 2025 | 06:50 PM