Vishnu Vishal: ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా 'ఆర్యన్'....
ABN , Publish Date - Oct 04 , 2025 | 02:53 PM
విష్ణు విశాల్ తాజా చిత్రం 'ఆర్యన్' అక్టోబర్ 31న విడుదల కాబోతోంది. ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాలలో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి పంపిణీ చేయబోతున్నారు. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీలో శ్రద్థా శ్రీనాథ్, మానస చౌదరి, సెల్వరాఘవన్ కీలక పాత్రలు పోషించారు.
కొంతకాలంగా సినిమా నిర్మాణం మీద కంటే... హీరో నితిన్ (Nithin) తండ్రి సుధాకర్ రెడ్డి (Sudhakar Reddy) సినిమాల పంపిణీ మీదనే దృష్టి పెడుతున్నారు. అంతేకాదు... తమిళం నుండి తెలుగుకు అనువాదమౌతున్న పలు చిత్రాలను రెండు తెలుగు రాష్ట్రాలలో పంపిణీ చేస్తున్నారు. తాజాగా ఆయన విష్ణు విశాల్ (Vishnu Vishal) హీరోగా నటించిన డార్క్ అండ్ ఇంటెన్స్ యాక్షన్ డ్రామా 'ఆర్యన్' (Aaryan) హక్కుల్ని సొంతం చేసుకున్నారు. అక్టోబర్ 31న ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాలలో శ్రేష్ఠ్ మూవీ ద్వారా విడుదల చేయబోతున్నారు.
'ఆర్యన్' సినిమా విషయానికి వస్తే... 'రాక్షసన్' తర్వాత విష్ణు విశాల్ మరోసారి పోలీస్ ఆఫీసర్ గా నటించిన సినిమా ఇది. శ్రద్థా శ్రీనాథ్ (Shraddha Srinath), మానస చౌదరి (Maanasa Chowdhary) ఇందులో హీరోయిన్లుగా నటించారు. ఈ మర్డర్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కు 'ఎఫ్.ఐ.ఆర్.' ఫేమ్ మను ఆనంద్ సహ రచయితగా వ్యవహరించాడు. దీనిని ప్రవీణ్ కె డైరెక్ట్ చేస్తున్నారు. సెల్వ రాఘవన్ తో పాటు సాయి రోనక్ (Sai Ronak), తారక్ పొన్నప్ప (Tarak Ponnappa), మాల పార్వతి, అవినాశ్, అభిషేక్ జోసెఫ్ జార్జ్ ఇందులో ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. శుభ్ర, ఆర్యన్ రమేష్ తో కలిసి విష్ణు విశాల్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. జిబ్రాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
Also Read: Mario: యాక్షన్ డ్రామాలో హెబ్బా పటేల్
Also Read: Sunday Tv Movies: ఆదివారం, OCT 5Th.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే