Mario: యాక్షన్ డ్రామాలో హెబ్బా పటేల్

ABN , Publish Date - Oct 04 , 2025 | 02:07 PM

అనిరుధ్, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న యాక్షన్ డ్రామా 'మారియో' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. దీనిని కళ్యాణ్ జీ గోగణ డైరెక్ట్ చేస్తున్నారు.

Hebah Patel Mario Movie

'నాటకం’, ‘తీస్ మార్ ఖాన్’ వంటి డిఫరెంట్ చిత్రాలతో దర్శకుడిగా కళ్యాణ్ జీ గోగణ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన దసరా సందర్భంగా తన తదుపరి చిత్రం 'మారియో' నుంచి అప్డేట్ ఇచ్చారు. ‘మారియో’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. దీనికి పెట్టిన ట్యాగ్ లైన్ 'ఎ టర్బో-చార్జ్డ్ ర్యాంప్ రైడ్' అనేది ఆసక్తి కలిగిస్తోంది. ఈ పోస్టర్ చూస్తుంటే... ఇది యాక్షన్-ప్యాక్డ్, స్టైలిష్, రొమాంటిక్ మూవీ అనిపిస్తోంది.

ఫస్ట్ లుక్‌లో హీరో అనిరుధ్, హెబ్బా పటేల్ పెట్టిన పోజుతో వారి మధ్య ఉన్న కెమిస్ట్రీ అర్థం అవుతోంది. హీరో అనిరుధ్ రైఫిల్ పట్టుకుని ఉన్న తీరు, ఇంటెన్స్ లుక్ చూస్తుంటే హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్ ఉండేలా కనిపిస్తున్నాయి. హెబ్బా పటేల్ ఎరుపు రంగు దుస్తుల్లో డైనమిక్ గా ఉంది. క్లాసిక్ కారు, చీకటి, వర్షం ఇలా అన్నింటినీ చూస్తుంటే థ్రిల్లర్ థీమ్‌ను సూచిస్తుంది. సీట్ ఎడ్జ్ థ్రిల్ కలిగించేలా అన్ని రకాల కమర్షియల్ అంశాలను తగినంత వినోదంతో మిళితం చేసే చిత్రాన్ని మేకర్స్ అందిస్తున్నారనిపిస్తోంది.


సిల్వర్ స్క్రీన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో 'మారియో' చిత్రం రూపుదిద్దుకుంటోంది. దీనికి రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్ కో-పార్ట్నర్ గా ఉంది. గత చిత్రాలలో కామెడీ, థ్రిల్‌ను విజయవంతంగా మిళితం చేసిన దర్శకుడు కళ్యాణ్‌ జీ గోగణ ఈసారి సినిమాటిక్ అనుభవాన్ని అందించబోతున్నారని నిర్మాతలు తెలిపారు. ఇప్పటి వరకూ నటన, మాటలు, పాటల రచనకు పరిమితం అయిన రాకేందు మౌళి తొలిసారి ఈ సినిమాకు సాయి కార్తీక్ తో కలిసి సంగీతం అందిస్తున్నాడు. అలానే ఈ సినిమాకు కథ, మాటలు సమకూర్చాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే తెలియచేస్తామని మేకర్స్ అన్నారు.

Also Read: Sunday Tv Movies: ఆదివారం, OCT 5Th.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

Also Read: Mirai OTT: షాకింగ్‌.. స‌డ‌న్‌గా ఓటీటీకి మిరాయ్‌! ఎంతులో.. ఎప్ప‌టినుంచంటే

Updated Date - Oct 04 , 2025 | 02:08 PM