Coolie: నాగ్, రజినీని మించి ఆ ఇద్దరు.. ఏం నటించారయ్యా
ABN , Publish Date - Aug 15 , 2025 | 10:19 PM
సాధారణంగా ఒక సినిమా హిట్ అయ్యింది అంటే అందరూ హీరో హీరోయిన్లకు పేరొస్తుంది. లేకపోతే డైరెక్టర్ కు పేరొస్తుంది. అయితే చాలా రేర్ గా హీరోను కూడా డామినేట్ చేసే రోల్స్ కొంతమందికి పడతాయి. వాటివలనే వారు కెరీర్ లో స్టార్ డమ్ ను అందుకుంటారు.
Coolie: సాధారణంగా ఒక సినిమా హిట్ అయ్యింది అంటే అందరూ హీరో హీరోయిన్లకు పేరొస్తుంది. లేకపోతే డైరెక్టర్ కు పేరొస్తుంది. అయితే చాలా రేర్ గా హీరోను కూడా డామినేట్ చేసే రోల్స్ కొంతమందికి పడతాయి. వాటివలనే వారు కెరీర్ లో స్టార్ డమ్ ను అందుకుంటారు. అలా కూలీ(Coolie) సినిమాలో ఇద్దరు స్టార్స్.. హీరోను మించి అదరగొట్టేశారు. వారెవరు.. ? ఎందుకు వారికి అంత పేరు వచ్చింది అనేది చూద్దాం. సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) హీరోగా లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కూలీ. సన్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ఆగస్టు 14 న రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ను అందుకుంది.
లోకేష్.. ఇప్పటివరకు కోలీవుడ్ లో పరాజయం ఎరుగని దర్శకుడుగా ఎదిగాడు. కమల్ హాసన్ కు విక్రమ్ లాంటి సినిమా ఇచ్చి ఆయన కెరీర్ లో సెన్సేషన్ హిట్ ను అందించాడు. ఇక దీంతో పాటు LCU అని స్టార్ట్ చేసి.. ఒక సినిమాతో ఇంకో సినిమాను లింక్ చేసి మరింత హైప్ క్రియేట్ చేశాడు. దీంతో లోకేష్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ప్రేక్షకులు అంచనాల నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. అలానే అందరూ కూలీ మీద కూడా భారీ అంచనాలను పెట్టుకున్నారు. అందుకు కారణం.. లోకేష్ స్టార్ క్యాస్ట్ ను దింపడమే. ఇప్పటివరకు అక్కినేని నాగార్జున చేయని విలన్ పాత్రను లోకేష్ చేయించడంతో అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ మొత్తం నాగ్ విలనిజం కోసంఎదురుచూసింది.
ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా మొదటిరోజే మిక్డ్స్ టాక్ ను అందుకుంది. ఇక సినిమాలో రజినీకాంత్, నాగార్జున, సత్యరాజ్, శృతి హాసన్, ఆమీర్ ఖాన్, సౌబిన్ షాహిర్, రచిత రామ్.. ఇలా స్టార్స్ మొత్తం తమ తమ పాత్రల్లో నటించారు. అయితే వారందరి కంటే.. సౌబిన్, రచిత పాత్రలు మాత్రం ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. సౌబిన్ షాహిర్.. మోనికా సాంగ్ తో ఎంత పాపులర్ అయ్యాడో అందరికీ తెల్సిందే. అసలు ఆ ఏజ్ కు, ఆయన లుక్ కి.. ఈయన నుంచి ఇలాంటి డ్యాన్స్ ను ఊహించుకోవడమా అనుకున్నారు. కానీ, ఆయన డ్యాన్స్ చూసి షాక్.. షాక్ అయ్యారు.
అయితే డ్యాన్స్ తోనే సినిమాలో ఫిదా చేస్తాడు అనుకుంటే పొరపాటే.. నటనతో మరింత అదరగొట్టేశాడు. మెయిన్ విలన్ నాగ్ అయినా కూడా అందరి కళ్ళు సౌబిన్ విలనిజం పైనే ఉంటాయి. అసలు ఆ క్రూరత్వం, ఆ నవ్వు.. మెయిన్ విలన్ అయిన నాగ్ పక్కన ఉన్నా కూడా తన నటనతో డామినేట్ చేశాడు అని చెప్పొచ్చు. ముఖ్యంగా బురదలో నుంచి బయటకు వచ్చి అతను ఇచ్చే ఎక్స్ ప్రెషన్స్ అయితే ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. నాగ్, రజినీ లాంటి ఘటికులు ఉన్నా కూడా మొత్తం క్రెడిట్ సౌబిన్ కొట్టేశాడు. ఈ సినిమా తరువాత ఈ నటుడుకు పాన్ ఇండియా లెవెల్ లో మంచి అవకాశాలు అందుకుంటాడు అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు.
సౌబిన్ తరువాత అందరి దృష్టిని ఆకర్షించింది రచిత రామ్. ఎంతో సింపుల్ గా కనిపించినా ఆమె క్యారెక్టర్ ను లోకేష్ డిజైన్ చేసిన విధానం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఎంతో సైలెంట్ గా కనిపిస్తూ మధ్యలో కలర్స్ ఛేంజ్ చేసే ఆ క్యారెక్టర్ ను చూసి ఫ్యాన్స్ షాక్ అవుతారు. రచిత తెలుగువారికి సుపరిచితమే. కళ్యాణ్ దేవ్ హీరోగా నటించిన సూపర్ మచ్చి సినిమాతో తెలుగుతెరకు పరిచయం అయ్యింది. అది ఆశించనంత ఫలితాన్ని అందించలేకపోయింది. అమ్మడికి కన్నడలో అద్భుతమైన పేరు ఉంది. ఇక ఇప్పుడిప్పుడే తమిళ్ లో కనిపిస్తున్న రచితకు కూలీ మంచి పేరును తీసుకొచ్చిపెట్టింది. కూలీ సినిమా గుర్తున్నవారికి అందులో నటించినవారు ఎవరు గుర్తున్నా లేకున్నా ఈ రెండు పాత్రలు మాత్రం కచ్చితంగా గుర్తుంటారు అని ప్రేక్షకులు చెప్పుకొస్తున్నారు.
Alia Bhatt: అలియా భట్ కోపానికి కారణం ఏంటి..
Tollywood Producers: కార్మికులకు వ్యతిరేకులం కాదు.. మాకు సహకరించండి