Alia Bhatt: అలియా భట్ కోపానికి కారణం ఏంటి..
ABN , Publish Date - Aug 15 , 2025 | 09:34 PM
స్టార్స్ అంటే అందరికీ ఇష్టమే. వారు ఏం చేస్తున్నారు.. ? ఇళ్లలో ఎలా ఉంటారు.. ? వాళ్ల పిల్లలు ఎవరు.. ? ఇలాంటివన్నీ తెలుసుకోవాలని కుతూహలం ఉంటుంది. ప్రజలకు ఇలాంటి అప్డేట్స్ ఇవ్వడానికి ఫొటోగ్రాఫర్లు వారివెంట పడుతూనే ఉంటారు.
Alia Bhatt: స్టార్స్ అంటే అందరికీ ఇష్టమే. వారు ఏం చేస్తున్నారు.. ? ఇళ్లలో ఎలా ఉంటారు.. ? వాళ్ల పిల్లలు ఎవరు.. ? ఇలాంటివన్నీ తెలుసుకోవాలని కుతూహలం ఉంటుంది. ప్రజలకు ఇలాంటి అప్డేట్స్ ఇవ్వడానికి ఫొటోగ్రాఫర్లు వారివెంట పడుతూనే ఉంటారు. లైక్స్, షేర్స్ కోసం ఎలాంటి పని అయినా చేయడానికి ఫొటోగ్రాఫర్లు సిద్ధమవుతున్నారు. అయితే స్టార్స్ కూడా మనుషులే. వారికి కూడా పర్సనల్ లైఫ్ ఉంటుంది. వారు కూడా ఆ ప్రైవేట్ లైఫ్ ను ఎంజాయ్ చేయాలనీ చూస్తూ ఉంటారు. ఇలా కెమెరామ్యాన్స్ వలన అలాంటి లైఫ్ దొరకడం లేదనే ప్ పెద్ద పెద్ద ఇళ్లకు అద్దాలు పెట్టించుకుంటున్నారు. అయినా కూడా వారి ఆగడాలు ఆగడం లేదు.
సెలబ్రిటీలు ఎక్కడకు వెళ్తే అక్కడకు వెంటవెళ్లి వారి పర్సనల్ ఫోటోలను తీయడం, వారి అనుమతి లేకుండా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఇదే పనిగా మారిపోయింది. కొందరు సెలబ్రిటీలు ఇలాంటివి కామన్ అని వదిలేస్తున్నారు. ఇంకొందరు కెమెరాల ముందే ఫైర్ అవుతున్నారు. తాజాగా అలియా భట్ ఫొటోగ్రాఫర్లపై ఫైర్ అయ్యింది. దానికి కారణం ఆమె పొట్టి డ్రెస్ ను అనుమతి లేకుండా ఫోటోలు తీయడమే కాకుండా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఒకటి అయితే .. ఇంటివరకు ఆమెను ఫాలో అవుతూ రావడమే కాకుండా లోపలికి తోసుకువచ్చి ఫోటోలు తీయడం.. ఆమెను ఇబ్బంది కలిగించింది. దీంతో అలియా ఓపిక నశించి వారిపై అసహనం వ్యక్తం చేసింది.
నేడు ఆమె ఉదయం ముంబైలో పికిల్ బాల్ గేమ్ ఆడుతూ కనిపించింది. థైస్ పైకి స్పోర్ట్స్ డ్రెస్ వేసి ఆటలో ఆదమరిచి మరీ కనిపించింది. దీంతో ఆలియాను ఇష్టానుసారంగా ఫోటోలు తీసి ఆమె ఫిట్ బాడీని ఆమె పర్మిషన్ లేకుండా సోషల్ మీడియాలో షేర్ చేయడం అవికాస్తా వైరల్ గా మారడం జరిగిపోయాయి. ఆ తరువాత గేమ్ అనంతరం ఆలియా వెనుకే ఇంటివరకు వచ్చి.. ఒక్క ఫోటో ఒక్క ఫోటో అంటూ వెంటపడ్డారు. ఇక ఇంటిలోపలికి కూడా రావడానికి ప్రయత్నించడంతో ఆలియా ఒక్కసారిగా ఫైర్ అయ్యింది. లోపలికి రాకండి.. ఇదేమి మీ ఇల్లు కాదు. దయచేసి వెనక్కి వెళ్లండి అంటూ అరిచింది. దానికి వారు ఆగకుండా ఆమె డ్రెస్ ను జూమ్ చేసి అక్కడ నుంచే ఫోటోలు క్లిక్ మనిపించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. నిజం చెప్పాలంటే ఆలియా ఫైర్ అవ్వడంలో తప్పేమి లేదని, వారు కూడా మనుషులే కదా.. అలా చేయొచ్చా అని మండిపడుతున్నారు.
Tollywood Heroes: బాలీవుడ్ డైరెక్టర్స్ ను నమ్మడమే వీరు చేసిన తప్పా
Allu Aravind: అల్లు అర్జున్ ను మరచిపోవడమే కారణమా...!?