Tollywood Producers: కార్మికులకు వ్యతిరేకులం కాదు..  మాకు సహకరించండి 

ABN , Publish Date - Aug 15 , 2025 | 09:37 PM

టాలీవుడ్‌ నెలకొన్న పరిస్థితులు, కార్మికుల వేతనాల పెంపు నేపథ్యంలో నిర్మాతలకు, ఫెడరేషన్‌కు మధ్య చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే.


టాలీవుడ్‌ (Tollywood) నెలకొన్న పరిస్థితులు, కార్మికుల వేతనాల పెంపు నేపథ్యంలో నిర్మాతలకు, ఫెడరేషన్‌కు మధ్య చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు మూడు, మీటింగ్‌లు అయినా సమస్యకు పరిష్కారం దొరకలేదు. కథ ఓ కొలిక్కి రాలేదు. తాజాగా ఈ విషయంపై నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్‌ చెర్రీ, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ నుంచి వివేక్‌ కూచిభోట్ల, నిర్మాత రాధామోహన్‌ (Producers) సమావేశమై ఈ సమస్యపై చర్చించుకున్నారు.

దీనిపై మాట్లాడుతూ ‘సినీ కార్మికులకు మేం వ్యతిరేకం కాదని చెప్పడానికి మరోసారి చెబుతున్నాం. మేము పెట్టిన 4 ప్రతిపాదనలు కార్మికులు అంగీకరిస్తే వేతనాల పెంపు పై మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం.  వీటిలో ఆల్రెడీ ఒకటి, రెండు ప్రతిపాదనలను 2022 లోనే అంగీకరించారు. ఇక మూడు, నాలుగు ప్రతిపాదనల దగ్గర చర్చలు ఆగాయి. మేం ఎవరికీ వ్యతిరేకం కాదు. కార్మికులు కూడా ప్రస్తుత పరిస్థితులు (మార్కెటింగ్‌, నాన్‌ థియేటర్స్‌) అర్థం చేసుకుని సహకరించాలి’ అని కోరారు.

కార్మికుల ముందు ఉంచిన ప్రతిపాదనలు ఇవే..
1. టాలెంట్‌ ఉన్న వారిని ఎవరినైనా పెట్టుకొనే అవకాశం.
2. ఫైటర్స్‌, డాన్సర్స్‌, రేషియో లేకుండా చూడటం.

3. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకూ ఉన్న కాల్షీట్‌లతోపాటు 9 నుంచి 9 కాల్‌ షీట్‌లను కూడా అమలు చేయాలి.
4. ఆదివారం డబుల్‌ కాల్షీట్‌ లేకుండా చూడటం.

(రెండో ఆదివారం మరియు ప్రభుత్వం ప్రకటించిన సెలవులకు డబుల్‌ కాల్‌ షీట్‌ ఒకే). 

Updated Date - Aug 15 , 2025 | 09:40 PM