Prithviraj Sukumaran: ఓర్వలేక ఇంత నీచానికి దిగజారుతున్నారు..
ABN, Publish Date - Nov 28 , 2025 | 01:04 PM
తన బిడ్డ జోలికి వస్తే ఊరుకునేది లేదని కొన్నాళ్ల క్రితం నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తల్లి మల్లిక హెచ్చరించిన సంగతి తెలిసిందే! మరోసారి తన కొడుకుని టార్గెట్ చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
తన బిడ్డ జోలికి వస్తే ఊరుకునేది లేదని కొన్నాళ్ల క్రితం నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) తల్లి మల్లిక (Mallika) హెచ్చరించిన సంగతి తెలిసిందే! మరోసారి తన కొడుకుని టార్గెట్ చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పృథ్వీరాజ్ సుకుమారన్ కెరీర్‌ను అంతం చేయాలని కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని, అతడిని ఇండస్ర్టీ నుంచి పంపించేందుకు కుట్ర జరుగుతోందన్నారు మల్లిక. పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన తాజా చిత్రం ‘విలాయత్ బుద్థ’. ఈ సినిమా విషయంలోనూ తన కుమారుడిని టార్గెట్ చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘విలాయత్ బుద్థ’. జయన్ నంబియార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 21న విడుదలైంది. అప్పటినుంచి పృథ్వీపై ఆన్‌లైన్ వేదికగా కొందరు ట్రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమా ‘పుష్ప’ను పోలి ఉందంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. ఈ విషయం పృథ్వీరాజ్ తల్లి మల్లిక దృష్టికి రావడంతో తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘నా బిడ్డపై కొన్ని దాడులు జరిగినప్పుడు అతనికి మద్దతుగా నిలిచింది కొందరే. ఇప్పుడు కూడా ఆన్‌లైన్ వేదికగా అతడిపై దుర్భాషలాడుతున్నారు. పృథ్వీని టార్గెట్ చేస్తూ దాడికి దిగుతున్నారు. కెరీర్‌లో ఎదగడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎలాగైనా అతని కెరీర్ నాశనం చేయాలని ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్నారు. మలయాళ చిత్ర పరిశ్రమలో జనాలు ఇంత నీచానికి దిగజారుతారని అనుకోలేదు. ఇవన్నీ ఆపకపోతే సమయం వచ్చిన ప్రతిసారీ పోరాడుతూనే ఉంటా. నా బిడ్డను మాట అన్నా నేను ఒప్పుకోను’ అని మల్లిక అన్నారు. ప్రస్తుతం పృథ్వీరాజ్ ‘వారణాసి’ చిత్రంలో నటిస్తున్నారు.