Sivakarthikeyan: మదరాసిలో ఎన్టీఆర్ క్యామియో.. నిజమైతే ఎంత బావుండు
ABN , Publish Date - Sep 03 , 2025 | 09:52 PM
అమరన్ (Amaran) లాంటి హిట్ సినిమా తరువాత కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ (Sivakarthikeyan)నటిస్తున్న చిత్రం మదరాసి (Madharaasi).
Sivakarthikeyan: అమరన్ (Amaran) లాంటి హిట్ సినిమా తరువాత కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ (Sivakarthikeyan)నటిస్తున్న చిత్రం మదరాసి (Madharaasi). ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మదరాసి సెప్టెంబర్ 5 న రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ వేగవంతం చేసిన శివకార్తికేయన్.. అటు తమిళ్, ఇటు తెలుగు భాషల్లో వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాడు.
తాజాగా శివకార్తికేయన్, రుక్మిణి వసంత్ ను సుమ ఒక ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో సుమ వారిద్దరిని ఎన్నో ప్రశ్నలు అడిగింది. అందులో భాగంగాగానే ఒకవేళ మదరాసిలో గెస్ట్ రోల్ ఉంది. దాన్ని తెలుగు ఇండస్ట్రీలో ఎవరైనా చేయాలంటే మీరు ఎవరిని ఎంచుకుంటారు..? అన్న ప్రశ్నకు కొద్దిగా అలోచించి ఎన్టీఆర్ అని చెప్పుకొచ్చాడు. యాక్షన్ సినిమా కావడంతో శివకార్తికేయన్ తో పాటు ఎన్టీఆర్ కూడా ఉంటే ఈ సినిమా వేరే లెవెల్ కు వెళ్ళిపోతుంది. అది ఆయన మనసులో ఉంది.. కానీ, ఇదే నిజమైతే ఎంత బావుండు అని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
ఇక తెలుగు హీరోతో మల్టీస్టారర్ చేయాల్సివస్తే ఏ హీరోతో చేస్తావ్ అన్న ప్రశ్నకు.. న్యాచురల్ స్టార్ నాని అని చెప్పుకొచ్చాడు. ఇక తనపై వచ్చిన ఫేక్ రూమర్ ఏంటి అంటే.. అమరన్ సినిమా సమయంలో నేను బాడీ పెంచితే.. యూట్యూబ్ థంబ్ నెయిల్స్ లో నా తలను.. వేరొక బాడీకి అతికించి.. స్టెరాయిడ్స్ వాడానని, అందుకే నా ఆరోగ్యం పాడైందని రాసుకొచ్చారు. అది చూసి అయ్యయ్యో ఏంటి ఇది అనుకున్నాను' అని చెప్పుకొచ్చాడు. ఎన్నో అంచనాల నడుమ మదరాసి రిలీజ్ కు రెడీ అవుతోంది. అంతేకాకుండా ఘాటీతో పోటీకి దిగుతుంది. మరి ఈ రెండు సినిమాల్లో ఏది విన్నర్ గా నిలుస్తుంది అనేది చూడాలి.
Shweta Basu Prasad: కొత్త బంగారు బంగారు లోకం బ్యూటీ.. క్లివేజ్ షోతో కిర్రెక్కిస్తుందిగా
Shilpa Shetty: పేరు తెచ్చిన రెస్టారెంట్ ను మూసేసిన బ్యూటీ.. కారణం ఏంటి