Shilpa Shetty: పేరు తెచ్చిన రెస్టారెంట్ ను మూసేసిన బ్యూటీ.. కారణం ఏంటి
ABN , Publish Date - Sep 03 , 2025 | 08:28 PM
బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి (Shilpa Shetty) షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తనకు ఎంతో పేరు తీసుకొచ్చిన బాస్టియన్ (Bastian) రెస్టారెంట్ ను మూసివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
shilpa shetty: బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి (Shilpa Shetty) షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తనకు ఎంతో పేరు తీసుకొచ్చిన బాస్టియన్ (Bastian) రెస్టారెంట్ ను మూసివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. గురువారం బాస్టియన్ రెస్టారెంట్ ను మూసివేస్తున్నామని, ఆరోజు రెస్టారెంట్ లో తమ వ్యాపార భాగస్వామ్యులకు ఒక చిన్న విందు ఇవ్వనున్నట్లు చెప్పుకొచ్చింది. బాస్టియన్ ను మూసివేస్తున్నందుకు తానెంతో బాధపడుతున్నట్లు కూడా తెలిపింది.
' ఈ గురువారం ముంబైలోని అత్యంత ప్రసిద్ధ గమ్యస్థానాలలో ఒకటైన బాస్టియన్ బాంద్రాకు వీడ్కోలు పలుకుతూ ఒక శకానికి ముగింపు పలుకుతున్నాం. బాస్టియన్.. మాకు లెక్కలేనన్ని జ్ఞాపకాలను, మరపురాని రాత్రులను అందించింది. ఇక బాస్టియన్ చివరి రోజును మేము మా ఫ్రెండ్స్, వ్యాపార భాగస్వామ్యుల కోసం ఒక ప్రత్యేకమైన సాయంత్రాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మేము త్వరలోనే కొత్త అనుభవాలతో సరికొత్తగా మీ ముందుకు వస్తాను' అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇదే బాలీవుడ్ మీడియాను షేక్ చేస్తున్న వార్త. అయితే ఇంత సడెన్ గా రెస్టారెంట్ ను మూసివేయడానికి కారణం ఏంటి అనేది మాత్రం తెలియరాలేదు.
ఇక బాస్టియన్ రెస్టారెంట్.. శిల్పా శెట్టి ఎంతో ప్రేమతో ముంబైలోని బాంద్రాలో ఓపెన్ చేసింది. ఆనతి కాలంలోనే ఆ రెస్టారెంట్ ఎంతో గుర్తింపును తెచ్చుకుంది. ముంబైలోని అతిపెద్ద రెస్టారెంట్స్ లో బాస్టియన్ ఒకటి. సెలబ్రిటీలు అందరూ ఎక్కువగా వచ్చే రెస్టారెంట్ బాస్టియన్. అంతా పేరు తెచ్చిన రెస్టారెంట్ ను శిల్పా శెట్టి ఎందుకు మూసివేస్తుంది అనేది మిస్టరీగా మారింది.
Jagapathi Babu: వర్మ..ఆ సినిమాలో నీ ముఖం ఎవడు చూస్తాడన్నాడు
Sonakshi Sinha: వెబ్‌సైట్స్ కు సోనాక్షి మాస్ వార్నింగ్