సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Vijay Sethupathi: కాస్తంత ఆలస్యంగా తెలుగులో 'సార్.. మేడమ్'

ABN, Publish Date - Jul 26 , 2025 | 04:51 PM

విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ జంటగా నటించిన 'తలైవన్ తలైవి'. ఈ సినిమా తెలుగులో 'సార్ మేడమ్'గా డబ్ అయ్యింది. ఇప్పుడీ సినిమా ఆగస్ట్ 1న రాబోతోంది.

Sir - Madam movie

వెర్సటైల్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi), వెరీ ట్యాలెంటెడ్ నిత్యా మేనన్‌ (Nitya Menon) జంటగా నటించి రోమ్ కామ్ ఫ్యామిలీ డ్రామా 'తలైవాన్ తలైవి' (Thalaivan Thalaivii). ఈ సినిమా ఇటీవల తమిళనాట విడుదలైంది. అయితే తెలుగులోనూ 'సార్ మేడమ్' (Sir Madam) పేరుతో దీనిని డబ్ చేసి 25వ తేదీ రిలీజ్ చేస్తామని మేకర్స్ చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan) 'హరిహరవీరమల్లు' (Hari Hara Veera Mallu) దానికి ఒకరోజు ముందు 24న విడులైన కారణంగా ఈ డబ్బింగ్ సినిమా తెలుగులో శుక్రవారం విడుదల కాలేదు. ఈ నేపథ్యంలో ఇక ఈ చిత్రం ఓటీటీలోనే అన్ని భాషల్లో వస్తుందనే ప్రచారం ముమ్మరంగా జరిగింది. ఆ ప్రచారానికి చెక్ పెడుతూ దర్శక నిర్మాతలు తెలుగులో 'సార్ మేడమ్' మూవీని ఆగస్ట్ 1న విడుదల చేయబోతున్నట్టు తెలిపారు.


అయితే ఈ వీకెండ్ లో కూడా 'సార్ మేడమ్' మూవీకి పోటీ తప్పడం లేదు. ఈ గురువారం విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) పాన్ ఇండియా మూవీ 'కింగ్ డమ్' (Kingdom) విడుదల కాబోతోంది. ఈ సినిమాను సితార ఎంటర్ టైమ్ మెంట్స్ సంస్థ నిర్మించడంతో భారీ ఎత్తున ఈ సినిమా థియేటర్లలో సందడి చేయబోతోంది. ఇప్పటికే 'హరిహర వీరమల్లు' విడుదలై థియేటర్లలో ఉండటం, దానికి తోడు ఓ వారం తర్వాత 'కింగ్ డమ్' వస్తుండటంతో జూలై లాస్ట్ వీకెండ్ మరింత టైట్ గా ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో ఆగస్ట్ 1న 'సార్ మేడమ్'కు ఏ మేరకు థియేటర్లు దొరకుతాయనే సందేహాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు ఆగస్ట్ 1నే తెలుగు సినిమా 'ఉసురే, ధ్యాంక్యూ డియర్' కూడా విడుదల కావాల్సి ఉంది. ఇప్పటికే తమిళనాట విడుదలైన విజయ్ సేతుపతి, నిత్యామీనన్ మూవీకి మిక్డ్స్ టాక్ వచ్చింది. ఇందులో పరోటా మాస్టర్ గా విజయ్ సేతుపతి నటించారు. అతనితో నిత్యం కొట్టాడే భార్యగా నిత్యామీనన్ చేసింది. ఇతర ప్రధాన పాత్రలను యోగిబాబు, ఆర్.కె. సురేశ్‌, దీప, జానకీ సురేశ్‌ తదితరులు పోషించారు. సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు మ్యూజిక్ ఇచ్చారు. పాండిరాజ్ దర్శకత్వంలో 'సార్ మేడమ్' మూవీని సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మించారు.

Also Read: Sobhan Babu: బ్లాంక్ చెక్ ఇచ్చినా మహేష్ కు తాతగా చేయను

Also Read: Mirai Song: సాంగ్ లోనే కాదు.. కుర్రాడిలో కూడా మంచి వైబ్ ఉందిగా

Updated Date - Jul 26 , 2025 | 04:51 PM