సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Simbu: వెట్రిమారన్‌ సినిమా కోసం శింబు సాహసం..

ABN, Publish Date - Jul 15 , 2025 | 02:37 PM

కోలీవుడ్‌ హీరో శింబు తన తదుపరి చిత్రం కోసం కసరత్తులు చేస్తున్నారు. దర్శకుడు వెట్రిమారన్‌ తెరకెక్కిస్తున్న సినిమా కోసం నానా కష్టాలు పడి 10 రోజుల్లో 10 కిలోలు బరువు తగ్గాడు.

కోలీవుడ్‌ హీరో శింబు (Simbu)తన తదుపరి చిత్రం కోసం కసరత్తులు చేస్తున్నారు. దర్శకుడు వెట్రిమారన్‌ (Vetrimaran) తెరకెక్కిస్తున్న సినిమా కోసం నానా కష్టాలు పడి 10 రోజుల్లో 10 కిలోలు బరువు తగ్గాడు. వడ చెన్నై (vada chennai) తరహాలో ఈ సినిమా ఉంటుందని టాక్‌. దీని కోసమే శింబు కసరత్తులు చేసి బాడీ తగ్గించారు.

గతంలో శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘ఐ’ సినిమా కోసం విక్రమ్‌ ఎంతలా కష్టపడ్డాడో చూసి జనాలు అవాక్కయ్యారు. ఫస్టాఫ్‌లో బాడీ బిల్డర్‌గా కనిపించిన ఆయన సెకండాఫ్‌లో బక్కగా మారిపోయాడు. ఇక ‘చావా’ సినిమా కోసం విక్కీ కౌశల్‌ 25 కిలోల వరకు బరువు పెరగాడు. తాజాగా కోలీవుడ్‌ హీరో శింబు తాజా సినిమా కోసం 10 రోజుల్లో 10 కిలోల బరువు తగ్గారు. సినిమా కథ, అందులో హీరో బాడీ లాంగ్వేజ్‌ పరంగా హీరోలు బరువు తగ్గడం, పెంచడం జరుగుతుంటుంది. అయితే ఒకేసారి బరువు తగ్గడం మంచిది కాదని డాక్టర్లు చెబుతుంటారు. కానీ సినిమా జనాలు ఈ విషయాన్ని అంతగా పట్టించుకోరు. ఫిట్‌నెస్‌ ముఖ్యమని భావిస్తారు. ఫిజికల్‌ ట్రైనర్ల సాయంతో బరువు ఒకేసారి పెరగడం, ఒకేసారి తగ్గడం చేస్తుంటారు. ఇదంతా తాము నటించే సినిమాల కోసమే అయినా దీనికోసం వాళ్లు ఎంతో శ్రమ పడుతుంటారు. ఇప్పుడు ఈ సినిమా విషయంలో శింబు కూడా అంతే కష్టపడ్డారని చెబుతున్నారు కోలీవుడ్‌ జనాలు.



వెట్రిమారన్‌ తీసిన వడ చెన్నై భారీ విజయం సాధించడంతో అదే స్థాయి కథతో ఈ సినిమా చేస్తున్నారు. అవుట్‌పుట్‌ అంతకు మించి ఉంటుందని చెబుతున్నారు. ఈ సినిమా కోసమే శింబు డైట్‌, వర్కవుట్స్‌ చేసి బరువు తగ్గాడట. ఈ సినిమాలో ‘జైలర్‌’ దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ కూడా గెస్ట్‌ రోల్‌లో కనిపించనున్నారని టాక్‌.

ALSO READ: Kareena Kapoor Khan: ఇప్పటికీ నాజూగ్గా.. కరీనా డైట్‌ గురించి ఇదే..

Nidhhi Agerwal: హరిహర వీరమల్లు పార్ట్‌-2 అప్డేట్


Updated Date - Jul 15 , 2025 | 02:54 PM