Kareena Kapoor Khan: ఇప్పటికీ నాజూగ్గా.. కరీనా డైట్ గురించి ఇదే..
ABN , Publish Date - Jul 15 , 2025 | 12:49 PM
వయసు మీద పడినా కానీ స్లిమ్‌గా, గ్లామర్‌గా కనిపించాలనుకుంటారు సినీతారలు. సైజ్ జీరో (Size zero Tag) ట్యాగ్ కోసం తపన పడుతుంటారు. అలా కనిపిస్తేనే ఈ పోటీ ప్రపంచంలో ఎక్కువ కాలం ఇండస్ట్రీలో నిలబడగలుగుతారు.
వయసు మీద పడినా కానీ స్లిమ్‌గా, గ్లామర్‌గా కనిపించాలనుకుంటారు సినీతారలు. సైజ్ జీరో (Size zero Tag) ట్యాగ్ కోసం తపన పడుతుంటారు. అలా కనిపిస్తేనే ఈ పోటీ ప్రపంచంలో ఎక్కువ కాలం ఇండస్ట్రీలో నిలబడగలుగుతారు. ఈ విషయంలో ఏ పరిశ్రమకు చెందిన హీరోయిన్ అయినా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. అది బాలీవుడ్‌లో ఇంకాస్త ఎక్కువ. అలా బీటౌన్‌లో సైజ్‌జీరోకు కొత్త డెఫినేషన్ ఇచ్చారు కథానాయిక కరీనా కపూర్ (Kareena Kapoor khan) . ఆమె ఒక ఫిట్‌నెస్ ఫ్రీక్. 2008 నుంచి ఆమెకు డైటీషియన్‌గా వ్యవహరిస్తున్న రుజుత దివికర్ ఆ సీక్రెట్‌ను బయటపెట్టారు. 40 ఏళ్ల వయసు, ఇద్దరి పిల్లలకు తల్లయినా ఆమె ఇప్పటికీ నాజుగ్గానే కనిపిస్తున్నారు. దాని వెనకున్న రహస్యాన్ని చెప్పుకొచ్చారు. 18ఏళ్లగా కరీనా ఒకే రకమైన ఆహార నియమాలు పాటిస్తున్నారని చెప్పారు.
‘‘కరీనా డే డ్రైఫ్రూట్స్‌తో మొదలవుతుంది. రాత్రంతా నానబెట్టిన బాదం, కిస్‌మిస్, అంజీరా తీసుకుంటారు. పొద్దునే వర్కవుట్స్ తర్వాత అల్పాహారంగా పరాటా లేదా పోహా ఎక్కువగా తింటారు. భోజన సమయం వరకు మంచి నీళ్లు తాగుతారు. మధ్యాహ్నం లంచ్‌లో అన్నం, పప్పు ఉండాల్సిందే. సాయంత్రం చీజ్ టోస్ట్ తింటారు. దీనితో పాటు, కాలాన్ని బట్టి లభించే ఫ్రెష్ ఫ్రూట్స్ తింటారు. వేసవిలో ఎక్కువగా మామిడి పండ్లు నేరుగా లేదా మిల్క్ షేక్ రూపంలో తీసుకుంటారు. ఇక రాత్రి భోజనం నెయ్యితో చేసిన కిచిడీ లేదా పులావ్ తింటారు. షూటింగ్‌లో సమయంలో ఈ మెనూలో కొన్ని మార్పులు ఉంటాయి. అక్కడ మాత్రం అన్నం, పప్పు తో సరిపెట్టుకుంటారు. షూటింగ్ లేని రోజుల్లో ఇంట్లో చేసే రోటీ, కూర ఉండాల్సిందే. కరీనా వారంలో ఐదు రోజులు నెయ్యితో చేసిన కిచిడీ తినేందుకు ఆసక్తి చూపుతారు’’ అని దివికర్ పంచుకున్నారు.
ఇదే విషయంపై కరీనా కూడా స్పందించారు. 10-15 రోజులు అదే పప్పు, అన్నం, పెరుగన్నం చేసి తన ఇంట్లో పనిచేసే వంటమనిషి విసిగిపోతాడని తెలిపింది. ‘మేడమ్.. ఇక నేను ఏ వంట చేయాలి’ అంటాడు. నాకు మాత్రం రోజూ అదే తిన్నా ఏమాత్రం విసుగురాదు. సాయంత్రం ఆరు గంటలకే డిన్నర్ అయిపోతుంది. రాత్రి 9.30 గంటలకు నిద్ర పోవాల్సిందే. ప్రపంచం నిద్రలేవక ముందే నా వర్కవుట్స్ పూర్తవుతాయి. వీటి వల్ల నా స్నేహితులు కూడా నన్ను నైట్ పార్టీలకు పిలవడం మానేశారు. నా శరీరాకృతి చూసి, నేను ఎక్కువగా క్వినోవా తీసుకుంటానన్న ప్రచారం ఉంది. అందులో నిజం లేదు’’ అని కరీనా చెప్పుకొచ్చింది.