Vijay Sethupathi: పూరి మూవీలో సంయుక్త
ABN, Publish Date - Jun 17 , 2025 | 12:03 PM
పూరి జగన్నాథ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించబోతున్న సినిమాలో విజయ్ సేతుపతి, టబు, దునియా విజయ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పుడీ సినిమాలోకి తాజాగా సంయుక్త వచ్చి చేరింది.
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh) తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) తో ఓ సినిమాను నిర్మిస్తున్నారు. ఛార్మి (Charmy) నిర్మాణ భాగస్వామిగా ఉంటున్న ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చి చాలా రోజులే అయ్యింది. ఇందులో ఓ ప్రధాన పాత్రకు టబును తీసుకున్నట్టు చిత్ర బృందం గతంలోనే ప్రకటించింది. ఇప్పుడీ సినిమాలో మరో కీలక పాత్ర కోసం సంయుక్త మీనన్ తీసుకున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా చిత్ర బృందం ప్రకటించింది.
పూరి, విజయ్ సేతుపతి కాంబోలో రాబోతున్న పాన్ ఇండియా మూవీకి 'బెగ్గర్' అనే పేరు ఖరారు చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇదే సమయంలో 'బెగ్గర్' అనే పేరును కోలీవుడ్ వర్గాలు అంగీకరించవు కాబట్టి దాని బదులు 'బిక్షాందేహి' అనే టైటిల్ పెడితే మరింత బెటర్ గా ఉంటుందనే సలహా వచ్చిందట. చిత్రం ఏమంటే... తమిళులు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంగ్లీష్ టైటిల్ ను అయినా యాక్సెప్ట్ చేస్తారు కానీ సంస్కృత పదాన్ని తమ సినిమాకు పేరుగా ఎందుకు ఒప్పుకుంటారు? అని కొందరంటున్నారు. ఏతావాతా ఈ సినిమా టైటిల్ పై ఇంకా అనిశ్చిత పరిస్థితి నెలకొని ఉంది.
Also Read: Anirudh Ravichander: రెచ్చిపోతున్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్