సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Rishab shetty: ఆ తరహా చిత్రాలకు కేరాఫ్‌గా రిషబ్‌శెట్టి

ABN, Publish Date - Jul 19 , 2025 | 03:05 PM

‘కాంతారా’ చిత్రంతో పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందారు శాండల్‌వుడ్‌ నటుడు రిషబ్‌ శెట్టి.  ఇప్పుడు పిరియాడిక్‌ చిత్రాలు, బయోపిక్‌లకు ఆయన కేరాఫ్‌గా మారారు.

‘కాంతారా’ చిత్రంతో పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందారు శాండల్‌వుడ్‌ నటుడు రిషబ్‌ శెట్టి.  ఇప్పుడు పిరియాడిక్‌ చిత్రాలు, బయోపిక్‌లకు ఆయన కేరాఫ్‌గా మారారు. ‘కాంతారా’కి సీక్వెల్‌గా కాంతార చాప్టర్‌ 1 తెరకెక్కుతోంది. ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 2న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత రిషబ్‌ శెట్టికి వరుసగా ప్రతిష్ఠాత్మక సినిమాలున్నాయి.

రాబోయే రోజుల్లో ఆయన నుంచి వచ్చే చిత్రాలు విభిన్నంగా ఉండబోతున్నాయనడానికి ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రాలే నిదర్శనం. 'కాంతార' తర్వాత హిట్‌ అయిన  వెంటనే దానికి సీక్వెల్‌గా 'కాంతార 2' (Kantara: Chapter 1) మొదలుపెట్టారు. అదలా ఉండగా తెలుగులో భారీ విజయం సాధించిన ‘హనుమాన్‌’కు కొనసాగింపుగా వస్తున్న ‘జై హనుమాన్‌’ (Jai hanuman) చిత్రంలో టైటిల్‌ పాత్రకు జెండా ఊపారు. అందులో ఆయన లుక్‌ కూడా ఇన్నోవేటివ్‌గా ఉంది.

 

ప్రస్తుతం ఆయన చారిత్రక నేపథ్యమున్న చిత్రాలు. బయోపిక్‌లు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే 'చత్రపతి శివాజీ' (The Pride of Bharat Chhatrapati Shivaji Maharaj) జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘ది ప్రైడ్‌ ఆఫ్‌ భారత్‌: చత్రపతి శివాజీ మహారాజ్‌’ సినిమా చేయనున్నారు. సందీప్‌ సింగ్‌ ఈ చిత్రానికి దర్శకుడు. ప్రస్తుతం షూటింగ్‌ సన్నాహాల్లో ఉంది.  ఈ సినిమా నుంచి రిషబ్‌ ఫస్ట్‌ లుక్‌ విడుదల చేయగా ఆకట్టుకుంది.

అయితే ఆయన నుంచి ఇంకొక  భారీ బడ్జెట్‌ చిత్రం ‘1770: ఏక్‌ సంగ్రామ్‌’  రానుంది. ఇది బంకిమ్‌ చంద్ర చట్టోపాధ్యాయ రచించిన ‘ఆనందమఠ్‌’ నవల ఆధారంగా తెరకెక్కుతుంది. దీనికి తెలుగు దర్శకుడు అశ్విన్‌ గంగరాజు దర్శకత్వం వహించనున్నారు. వీటితోపాటు ఈ తరహా చిత్రాలే మరికొన్ని లైనప్‌లో ఉన్నాయని తెలుస్తోంది. ఇవన్నీ కూడా చారిత్రక, బయోపిక్‌ కథలే. ఇలా కథల ఎంపికలో ప్రత్యేకత చూపిస్తున్న రిషబ్‌కు ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానం ఏర్పడింది. 

ALSO READ:
Fish venkat: శ్రీహరి స్నేహితుడు.. వి.వి.వినాయక్‌ గాడ్‌ఫాదర్‌

Kollywood: ఇద్దరు హీరోయిన్లు పెళ్ళిపీటలెక్కనున్నారు

Tollywood: అందాల భామలకు అచ్చిరాని రీ-ఎంట్రీ


Updated Date - Jul 19 , 2025 | 03:15 PM