Kantara Chapter 1: కాంతార కోసం రిషబ్ ఎంతలా కష్టపడ్డాడో చూడండి..
ABN , Publish Date - Oct 13 , 2025 | 09:09 PM
ఒక సినిమాను వెండితెరపై చూస్తున్నాము అంటే దానివెనుక ఉన్న నటీనటులతో పాటు చిత్ర బృందం కష్టం ఎంతో ఉంటుంది.
Kantara Chapter 1: ఒక సినిమాను వెండితెరపై చూస్తున్నాము అంటే దానివెనుక ఉన్న నటీనటులతో పాటు చిత్ర బృందం కష్టం ఎంతో ఉంటుంది. ముఖ్యంగా హీరోలు.. ఒక సినిమా కోసం ఎంతలా కష్టపడతారు అనేది ఎవరికీ తెలియదు. కోట్లు కోట్లు పారితోషికాలు తీసుకుంటున్నారు అనే అనుకుంటారు కానీ, ఆ పాత్ర కోసం.. ఆ సినిమాను ప్రేక్షకులకు గ్రాండ్ గా చూపించడం కోసం వారు ఎన్ని కష్టాలు పడతారు అనేది చాలా తక్కువమంది మాత్రమే గుర్తిస్తారు.
కాంతార చాఫ్టర్ 1 కోసం రిషబ్ శెట్టి పడిన కష్టం గురించి సోషల్ ,మీడియా మొత్తం చర్చిస్తుంది. ఒక సాధారణ నటుడిగా కెరీర్ మొదలుపెట్టి.. డైరెక్టర్ గా హిట్ అందుకున్నాకా కూడా సరైన గుర్తింపు లేక.. అప్పుల బాధల్లో.. ఎన్నో కష్టాలు పడుతున్న సమయంలోనే రిషబ్ తన ప్రాణం పెట్టి కాంతారను తెరకెక్కించాడు. ఆ దేవుడు ఆశీర్వాదం రిషబ్ ఉందో ఏమో ఈ ఒక్క సినిమాతో అతడి దశ మారిపోయింది. కాంతారతో ఓవర్ నైట్ స్టార్ హీరో, డైరెక్టర్ గా మారిపోయాడు.
ఇక కాంతారను అంత మంచిగా ఆదరించిన ప్రేక్షకులకు ఇంకా ఎక్కువ ఇవ్వాలి అని మరోసారి తన ప్రాణాలను పణంగా పెట్టి కాంతార చాఫ్టర్ 1 ని తెరకెక్కించాడు. ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి ఎన్ని అడ్డంకులు ఎదురైనా వేటికి తలవంచకుండా పట్టుదలతో సినిమాను రిలీజ్ చేసి భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా రికార్డ్ కలక్షన్స్ ను సాధించి ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసింది. థియేటర్ లో అందరూ విజువల్స్ సూపర్ అని అంటున్నారు అంటే దాని వెనుక రిషబ్ ఎంత కష్టపడ్డాడు అనేది ఊహించుకోవచ్చు. ముఖ్యంగా క్లైమాక్స్ కోసం రిషబ్ పడిన కష్టం ఈ ఫోటోలలో కనిపిస్తుంది.
క్లైమాక్స్ కోసం మట్టిలో కాళ్లు కొట్టుకుపోయిన.. నీరు పట్టినా కూడా పట్టించుకోకుండా విశ్రాంతి అనేది కూడా లేకుండా షూట్ చేసినప్పుడు కాళ్లు ఇలా అయిపోయాయని రిషబ్ చెప్పుకొచ్చాడు. ఈ ఫోటోలు చూస్తుంటేనే.. ఒక ఫిల్మ్ మేకర్ గా సినిమాను ప్రేక్షకులకు ఎంతో అద్భుతంగా చూపించాలి అనే తపన కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలను చూసిన నెటిజన్స్ నీ డెడికేషన్ కు హ్యాట్సాఫ్ అని కామెంట్స్ పెడుతున్నారు.
Mouli Tanuj: ఒరేయ్.. అఖిల్.. అప్పుడే అంత రెమ్యూనరేషనా
Dil Raju - OG: నైజాంలో 'ఓజి' తోపు.. లాభాల్లో దిల్ రాజు