Mouli Tanuj: ఒరేయ్.. అఖిల్.. అప్పుడే అంత రెమ్యూనరేషనా

ABN , Publish Date - Oct 13 , 2025 | 08:29 PM

ఇండస్ట్రీలో అదృష్టం ఎవరిని ఎప్పుడు వరిస్తుందో చెప్పడం చాలా కష్టం. కొందరు హీరోలు సినిమాలపైన సినిమాలు చేస్తూనే ఉన్నా కూడా రెమ్యూనరేషన్ కోటి దాటలేదు.

Mouli Tanuj

Mouli Tanuj: ఇండస్ట్రీలో అదృష్టం ఎవరిని ఎప్పుడు వరిస్తుందో చెప్పడం చాలా కష్టం. కొందరు హీరోలు సినిమాలపైన సినిమాలు చేస్తూనే ఉన్నా కూడా రెమ్యూనరేషన్ కోటి దాటలేదు. కానీ, చేసింది ఒక్క సినిమా అయినా కూడా ఒక కుర్ర హీరో రెండో సినిమాకు ఏకంగా కోటి డిమాండ్ చేస్తున్నాడని టాక్ నడుస్తోంది. ఆ హీరో ఎవరో కాదు మౌళి తనూజ్. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా కెరీర్ ను ప్రారంభించి వీడియోలు చేస్తూ.. #902s సిరీస్ తో ఓటీటీకి ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు.


ఇక ఆ సిరీస్ ఇచ్చిన జోష్ తో లిటిల్ హార్ట్స్ అనే సినిమాతో వెండితెరపై రంగప్రవేశం చేసి మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్నాడు.చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి.. పెద్ద సినిమాలను కూడా పక్కకు నెట్టేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆదిత్య హాసన్ నిర్మించిన ఈ చిత్రానికి సాయి మార్తాండ్ దర్శకత్వం వహించాడు. నిబ్బానిబ్బిలా లవ్ స్టోరీ అయినా కూడా మౌళి, జై కృష్ణ కామెడీతో సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉందని ప్రేక్షకులు చెప్పుకొచ్చారు. సెలబ్రిటీలు సైతం లిటిల్ హార్ట్స్ పై ప్రశంసలు కురిపించారు.


ఇక లిటిల్ హార్ట్స్ హిట్ తరువాత మౌళికి ఆఫర్స్ క్యూ కట్టాయి. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌసెస్.. మౌళి డేట్స్ కోసం వేచి చూస్తున్నాయి. తమ బ్యానర్ లో సినిమా చేయాలనీ అడుగుతున్నాయట. అందుతున్న సమాచారం ప్రకారం మైత్రీ మూవీ మేకర్స్.. మౌళికి కోటి రూపాయల రెమ్యూనరేషన్ ఆఫర్ ఇచ్చి లాక్ చేసినట్లు తెలుస్తోంది. లిటిల్ హార్ట్స్ కు మౌళి కేవలం రూ. 5 లక్షలు మాత్రమే అందుకున్నాడట. ఈ సినిమా ఎఫెక్ట్ ఒక్కసారిగా మౌళి రేంజ్ మారిపోయింది. సెకండ్ సినిమాకే మౌళి కోటి అందుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. దీంతో నెటిజన్స్ ఒరేయ్.. అఖిల్.. అప్పుడే అంత రెమ్యూనరేషనా అంటూ మోర్లు నొక్కుకుంటున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

NTR: ఎలా ఉండేవాడు.. ఎలా అయ్యిపోయాడు.. దారుణంగా ఎన్టీఆర్ లుక్

MSG : మీసాల పిల్లా.. ప్రతి భార్య, భర్తకు కనెక్ట్‌ అయ్యేలా..

Updated Date - Oct 13 , 2025 | 08:29 PM