Retro effect: పూజా ఇక పెళ్ళిపీటలు ఎక్కాల్సిందేనా...
ABN, Publish Date - May 02 , 2025 | 11:55 AM
'రెట్రో' మూవీపై పూజా హెగ్డే ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ ఆ సినిమా ఊహించని విధంగా పరాజయం పాలు కావడంతో పూజా ఆశలు అడియాసలయ్యాయి.
పొడుగు కాళ్ళ సుందరి పూజా హెగ్డే (Pooja Hegde) సాలీడ్ హిట్ చూసి ఐదేళ్ళు అయిపోతోంది. 'అల వైకుంఠపురములో' (Ala Vaikuntapuramulo) సినిమా తర్వాత ఆ స్థాయి విజయాన్ని పూజా హెగ్డే అందుకోలేక పోయింది. ఆ తర్వాత ఆమె హీరోయిన్ గా నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్', 'రాధేశ్యామ్' (Radhe Shyam) చిత్రాలు పరాజయం పాలయ్యాయి. 'ఆచార్య' సైతం ఆశించిన స్థాయిలో ఆడలేదు. 'ఎఫ్ -3' (F 3) మూవీ ఫర్వాలేదనిపించింది కానీ అందులో పూజా కేవలం స్పెషల్ సాంగ్ లో మాత్రమే నర్తించింది. ఈ ఐదేళ్ళ కాలంలో తమిళ చిత్రం 'బీస్ట్' (Beast) ఓకే కానీ... హిందీ సినిమాలు 'సర్కస్', 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' పరాజయం పాలయ్యాయి.
ఈ యేడాది పూజాను బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ పలకరించాయి. షాహిద్ కపూర్ సరసన నటించిన హిందీ చిత్రం 'దేవా' (Deva) పరాజయం పాలు కాగా, గురువారం వచ్చిన తమిళ చిత్రం 'రెట్రో' (Retro) అట్టర్ ఫ్లాప్ అయ్యింది. నిజానికి ఈ సినిమా మీద పూజా హెగ్డే భారీ ఆశలే పెట్టుకుంది. తెలుగు సినిమాలను కాస్తంత తగ్గించుకుని అమ్మడు ఈ మధ్య తమిళ, హిందీ మూవీస్ మీదనే ఫోకస్ పెట్టింది. అయితే.. హిందీ చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. తమింలోనూ అదే ఫలితాలు ఎదురు కావడంతో ఆమె గిలగిలలాడుతోందట.
తాజా వచ్చిన 'రెట్రో' మూవీలో పూజా హెగ్డే డీ-గ్లామర్ పాత్రను పోషించింది. ఆ పాత్ర తన మనసుకు ఎంతో నచ్చిందని, రాబోయే రోజుల్లో ఇలాంటి పాత్రలకే ప్రాధాన్యం ఇస్తానని చెప్పింది. కానీ 'రెట్రో' ఊహించని పరాజయాన్ని పొందటంతో పూజా నిర్ణయం ఎంత తప్పో అర్థమౌతోంది. సినిమానే కాదు... పూజా చేసిన డీ-గ్లామర్ పాత్రను కూడా జనాలు మెచ్చలేదు. దాంతో ఇలాంటి పాత్రలకు పూజా దూరంగా ఉంటే బెటర్ అనే మాట వినిపిస్తోంది.
ప్రస్తుతం పూజా హెగ్డే... రజనీకాంత్ 'కూలీ' (Coolie) సినిమాలో స్పెషల్ అప్పీయరెన్స్ ఇస్తోంది. అలానే విజయ్ చివరి చిత్రం 'జన నాయగన్' (Jana Nayagan) లో చేస్తోంది. లారెన్స్ 'కాంచన -4'లోనూ, హిందీ సినిమా 'హై జవానీ తో ఇష్క్ హోనా హై' లోనూ పూజా నటిస్తోంది. మరి ఈ సినిమాల్లో ఏవైనా విజయం సాధిస్తే... ఆమె కెరీర్ మరి కొంతకాలం సాగుతుంది. లేదంటే... 34 సంవత్సరాలు వచ్చిన పూజా పెళ్ళి దిశగా ఆలోచనలు చేస్తే మంచిదని సినిమా వర్గాలు అంటున్నాయి.
Also Read: Hit -3: మొదటి రోజు కలెక్షన్స్ అదరహో...
Also Read: Spirit: రూమర్స్‌కు చెక్ పెట్టిన నిర్మాత..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి