Hit -3: మొదటి రోజు కలెక్షన్స్ అదరహో...

ABN , Publish Date - May 02 , 2025 | 11:05 AM

నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ 'హిట్ -3'కి డివైడ్ టాక్ వచ్చింది. ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ సినిమా ఏ మాత్రం ఓన్ చేసుకోవడం లేదు. అయితే అదే సమయంలో మాస్, థ్రిల్లర్ మూవీస్ ను ఇష్టపడేవారు 'హిట్ -3' బాగుందంటున్నారు.

నేచురల్ స్టార్ నాని (Nani) రూటు మార్చాడు. ఫ్యామిలీ హీరో ఇమేజ్ నుండి బయట పడటానికి తాపత్రయ పడుతున్నాడు. అందుకు తగ్గ కథలను ఎంపిక చేసుకుని సినిమాలు చేస్తున్నాడు. అంతేకాదు... తెలుగు సినిమా దశ, దిశ కూడా మార్చే ప్రయత్నానికి కృషి చేస్తున్నాడు. మొన్న వచ్చిన 'దసరా' (Dasara), నిన్న వచ్చిన 'హిట్ -3' (Hit-3), వచ్చే యేడాది రాబోతున్న 'ది ప్యారడైజ్' (The Paradise) చిత్రాలు ఆ కోవలోకి చెందినవే. రొటీన్ కథ, కథనాలకు భిన్నంగా సమ్ థింగ్ స్పెషల్ గా, ఆడియెన్స్ కు న్యూ ఎక్స్ పీరియన్స్ ను ఇవ్వడానికి వీటి మేకర్స్ కృషి చేస్తున్నారు. హీరోగా, ప్రొడ్యూసర్ గా నాని అందుకు సంపూర్ణ సహకారం అందిస్తున్నాడు.


hit 1st day.jpegఇక తాజాగా విడుదలైన నాని 'హిట్ -3' మూవీ అయితే హింసాత్మకంగా సాగిందని అందరూ చెబుతున్న మాట. అయితే... నటుడిగా అర్జున్ సర్కార్ పాత్రకు నాని నూరు శాతం న్యాయం చేకూర్చాడని అంటున్నారు. కానీ ఈ సినిమా కథ చాలా పేలవంగా ఉందని, దానికి తగ్గట్టుగానే కథనమూ సాగిందన్నది కొందరు భావన. ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ సినిమాకు అంతగా కనెక్ట్ కారనే మాట బాగా వినిపిస్తోంది. కేవలం మాస్ ఆడియెన్స్ కు, థ్రిల్లర్ జోనర్ ను ఇష్టపడే వారికి మాత్రమే ఇది నచ్చుతుందని అంటున్నారు. అయితే... నాని మొదటి నుండి ఇది ఒక వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని తీసి సినిమా కాదని, యూనివర్శల్ గా అందరిని మెప్పిస్తుందని అనుకోవడం లేదని చెబుతూనే వచ్చాడు. ఆ రకంగా ఈ సినిమాకు మొదటి రోజు డివైడ్ టాక్ వచ్చింది. అయినా కూడా వరల్డ్ వైడ్ 'హిట్ -3' రూ. 43 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ వీకెండ్ కు ఇది వంద కోట్ల గ్రాస్ ను దాటేయడం ఖాయంగానే కనిపిస్తోంది. అయితే సోమవారం నుండి కలెక్షన్స్ ఎలా ఉంటాయన్నదానిపైనే 'హిట్ -3' సక్సెస్ ఆధారపడి ఉంటుంది.

Also Read: Allu arjun: ఎట్టకేలకు బన్నీ నోట చిరు మాట.. మావయ్యే స్ఫూర్తి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - May 02 , 2025 | 11:05 AM