Spirit: రూమర్స్‌కు చెక్‌ పెట్టిన నిర్మాత..

ABN , Publish Date - May 02 , 2025 | 11:05 AM

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా సందీప్‌ రెడ్డి వంగా ) తెరకెక్కిస్తున్న చిత్రం ‘స్పిరిట్‌’. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచే అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) హీరోగా సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) తెరకెక్కిస్తున్న చిత్రం ‘స్పిరిట్‌’ (Spirit). ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచే అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అంతే కాదు.. ఈ సినిమాకు సంబంధించి ఏ అప్‌డేట్‌ వచ్చినా వైరల్‌ అవుతుంటుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్‌ ఆలస్యం అవుతుందంటూ వచ్చిన వార్తలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. దీనిపై నిర్మాత భూషణ్‌ కుమార్‌ క్లారిటీ ఇచ్చారు. తాజా అప్‌డేట్‌ను షేర్‌ చేశారు.

ప్రస్తుతం సందీప్‌ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘యానిమల్‌’కు సీక్వెల్‌గా ‘యానిమల్‌ పార్క్‌’ (Animal park) తీయబోతున్నాం. అయితే స్పిరిట్‌ కంటే ముందే ‘యానిమల్‌ పార్క్‌’ తెరకెక్కుతుందని కొన్ని రోజులుగా వార్తలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. అందులో నిజం లేదు. మరో మూడు నెలల్లో ‘స్పిరిట్‌’ షూటింగ్‌ మొదలుకానుంది. ఆ తర్వాతే ‘యానిమల్‌ పార్క్‌’ను సెట్స్‌ మీదకి తీసుకెళ్తాం, 2027లో సినిమాను విడుదల చేస్తాం’’ అని అన్నారు.  అయితే సందీప్‌ వంగా సినిమా కన్నా ముందు ప్రశాంత్‌ వర్మతో ప్రభాస్‌ ఓ సినిమా చేయనున్నారని టాక్‌ నడిచింది. తాజాగా నిర్మాత భూషణ్‌ కుమార్‌  అప్‌డేట్‌తో ఇవ్వడంతో ఆ రూమర్స్‌కు చెక్‌ పడింది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలున్నాయి. రాజాసాబ్‌ విడుదలకుసిద్ధంగా ఉంది. ‘స్పిరిట్‌’, ‘కల్కి 2’, ‘సలార్‌ 2’ చిత్రాలు కూడా సెట్‌కు వెళ్లనున్నాయి. ‘కన్నప్ప’లో అతిథి పాత్రలో కనిపించనున్నారు.

Updated Date - May 02 , 2025 | 11:05 AM