సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Bro Code: ర‌వి మోహ‌న్‌కు షాక్‌.. వివాదంలో సొంత సినిమా

ABN, Publish Date - Oct 31 , 2025 | 01:57 PM

రవి మోహన్ తాజా చిత్రం టైటిల్ వివాదానికి తెర తీసింది. బ్రో కోడ్ అనే తమ బ్రాండ్ పేరును సినిమాకు పెట్టడంపై లిక్కర్ కంపెనీ ఢిల్లీ కోర్టు కెక్కింది. ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అంటున్నాడు రవి మోహన్.

Bro Code Movie

ప్రముఖ నిర్మాత ఎడిటర్ మోహన్ (Editor Mohan) చిన్న కొడుకు రవి మోహన్ (Ravi Mohan) కష్టాలకు ఇంకా శుభం కార్డు పడలేదు. అతని వైవాహిక జీవితమే కాదు కెరీర్ సైతం అప్ అండ్ డౌన్స్ తో సాగుతోంది. భార్యకు విడాకులిచ్చి ప్రశాంత జీవితం గడపాలని భావించిన రవి మోహన్, ఇటీవల ఓ సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. అందులో 'బ్రో కోడ్' (Bro Code) అనే సినిమాను మొదలు పెట్టాడు. కార్తీక్ యోగి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఎస్.జె. సూర్య (SJ Surya), అర్జున్ అశోకన్ (Arjun Ashokan), శ్రద్థా శ్రీనాథ్‌ (Sradha Srinadh) తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్ 'బ్రో కోడ్'... వివాదాలకు తెర లేపింది. ఓ ప్రముఖ బేవరేజ్ కంపెనీ తన లిక్కర్ బ్రాండ్ లోగోను మూవీకి టైటిల్ గా పెట్టారని, ఆ పేరును మార్చాల్సిందిగా ఢిల్లీ హైకోర్ట్ లో కేసు పెట్టింది. దాంతో లిక్కర్ బ్రాండ్, మూవీ టైటిల్ లోగో దాదాపుగా ఒకేలా ఉన్నాయని గుర్తించిన ఢిల్లీ హైకోర్ట్ 'బ్రో కోడ్' టైటిల్ ను మార్చమని చెప్పింది. అయితే... బేవరేజ్ కంపెనీ కోర్టుకు వెళ్ళడం వెనుక వేరే కథ ఉందని రవి మోహన్ చెబుతున్నాడు.


'బ్రో కోడ్' లిక్కర్ బ్రాండ్ ను తమిళనాడులోకి కూడా తీసుకు రావాలని భావించిన ఆ సంస్థ తమ సినిమాలో దాన్ని ప్రమోట్ చేయమని కోరిందని, ఇది కరెక్ట్ కాదని, తన సినిమా పేరు, బ్రాండ్ పేరు ఒక్కటైనంత మాత్రాన తాను అలా ప్రమోట్ చేయనని చెప్పానని రవి మోహన్ అంటున్నాడు. తన సినిమా ద్వారా తమ బ్రాండ్ ను ప్రమోట్ చేసుకోలేమని భావించని ఆ లిక్కర్ కంపెనీ ఇప్పుడు ఆ టైటిల్ వాడుకో కూడదని ఢిల్లీ హైకోర్టులో కేసు వేసిందని రవి మోహన్ చెబుతున్నాడు. అయితే ఇప్పటికే తాను ఈ టైటిల్ విషయమై మద్రాస్ హైకోర్ట్ లో కేసు వేశానని, తనకున్న హక్కులకు భంగం కలిగించకుండా చూడమని కోర్టును కోరానని, ఈ కేసు విషయమై మద్రాస్ హైకోర్టు నవంబర్ 21 వరకూ ఇన్ టీరియమ్ ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చిందని తెలిపాడు. లిక్కర్ కంపెనీ ఢిల్లీ హైకోర్టుకు ఎక్కడం ఓ పబ్లిసిటీ స్టంట్ అని రవి మోహన్ చెబుతున్నాడు. మరి 'బ్రో కోడ్' టైటిల్ అతనికి దక్కుతుందా? లిక్కర్ కంపెనీ పేరును సినిమాకు పెట్టడాన్ని సెన్సార్ బోర్డ్ అంగీకరిస్తుందా? అనేది వేచి చూడాలి.

Also Read: Chiranjeevi: డీప్‌ ఫేక్‌ వీడియోల పై చిరు ఏమన్నారంటే..

Also Read: Women’s Cricket Team: మహిళా క్రికెట్‌ జట్టుకు సెలబ్రిటీల అభినందనలు  

Updated Date - Oct 31 , 2025 | 04:22 PM