Coolie Trailer: ట్రైలర్ లేకుండా థియేటర్ లో కూలీ బొమ్మ
ABN, Publish Date - Jul 10 , 2025 | 03:03 PM
కొత్త రికార్డులు క్రియేట్ చేయాలన్నా... ఉన్న వాటిని బద్దలుకొట్టాలన్నా ఆ హీరో తర్వాతే ఎవరైనా! అలాంటి హీరో ఇప్పుడు మరో క్రేజీ రికార్డును, ట్రెండ్ ను సెట్ చేయబోతున్నాడు. రిస్క్ అయినా సరే.. ఛలో రెడీ అనేస్తున్నాడు.
ఒక మూవీ హిట్టా ఫట్టా అనేది జస్ట్ ట్రైలర్ కట్‌తో డిసైడ్ అవుతోంది. టీవీలు, ఇంటర్నెట్ లేని రోజుల్లోనూ థియేటర్‌లో ఒక సినిమా షో మధ్యలో మరో సినిమా ట్రైలర్‌ని చూపించి ఆడియన్స్‌ని రెడీ చేసేవారు. కట్ చేస్తే.. ఇప్పుడు డిజిటల్ యుగంలో ట్రైలర్ పవర్ మరింత పెరిగింది. ఒక్క ట్రైలర్‌తోనే సినిమా బిజినెస్ లక్షలు, కోట్లలో సెట్ అవుతోంది. కానీ ఇప్పుడు కోలీవుడ్‌లో ఒక సరికొత్త ట్రెండ్ స్టార్ట్ కాబోతోంది. అది కూడా సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth) ‘కూలీ’ (Coolie) మూవీతో. తమిళ్ ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం ప్రయోగానికి శ్రీకారం చుట్టడం హాట్ టాపిక్ గా మారింది. పైగా ఈ మూవీలో రజనీ రూ. 1000 కోట్ల మార్క్ ను టచ్ చేస్తాడని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
రజనీకాంత్ - లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) కాంబోలో వస్తున్న ‘కూలీ’ సినిమా గురించి అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అందులోనూ నాగార్జున (Nagarjuna), ఉపేంద్ర (Upendra), అమీర్ ఖాన్ (Aamir Khan) లాంటి స్టార్ కాస్ట్ జాయిన్ కావడంతో ఈ మూవీ హైప్ సూపర్‌సోనిక్ స్పీడ్‌లో దూసుకెళ్తోంది. ఇప్పటి వరకూ కొన్ని పోస్టర్లు, ఒక సాంగ్ రిలీజ్ చేశారు. అవి సోషల్ మీడియాలో రచ్చ చేశాయి. గ్లింప్స్, సాంగ్స్ తోనే బిజినెస్ దాదాపు క్లోజ్ అయిపోయింది. అందుకే టీమ్ ఒక బోల్డ్ డెసిషన్ తీసుకుందట. ట్రైలర్ లేకుండానే డైరెక్ట్‌గా థియేటర్స్‌లో సినిమాని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తోందట.
సాధారణంగా ట్రైలర్ చూస్తే కథ, క్యారెక్టర్స్, సినిమా వైబ్ గురించి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. కానీ ‘కూలీ’ టీమ్ ఆ రూట్‌లో వెళ్లడం లేదట. సినిమా రిలీజ్ అయిన రోజే ఆడియన్స్ ఫస్ట్ టైమ్ స్క్రీన్‌పై ఆ కిక్‌ని ఫీల్ అవ్వాలని... ఆ సర్‌ప్రైజ్ ఎలిమెంట్‌ని మిస్ చేయొద్దని టీమ్ భావిస్తోందట. ఈ ఐడియా బిజినెస్ పరంగా రిస్క్ అయినా ఇప్పటికే డీల్స్ సెట్ అయిపోవడంతో ఈ ప్రయోగం సేఫ్ జోన్‌లోనే ఉంది. ఇది పూర్తిగా కొత్తేమీ కాదు. రజనీకాంత్ సినిమా 'కబాలి' (Kabaali) సమయంలోనూ ట్రైలర్ రిలీజ్ చేయకుండా, కేవలం టీజర్‌తోనే థియేటర్స్‌లోకి వచ్చారు. అయితే ఆ సినిమా పూర్తి స్థాయిలో అభిమానులను ఆకట్టుకోలేదు. ఇప్పుడు ‘కూలీ’తో ఈ ట్రిక్‌ని మళ్లీ ట్రై చేస్తున్నారు. ఒకవేళ ఈ ఎక్స్‌పెరిమెంట్ వర్కౌట్ అయితే ట్రైలర్ లేకుండా సినిమా రిలీజ్ చేయడం ఫ్యూచర్‌లో ట్రెండ్ సెట్ కావచ్చు!
మరోవైపు రిలీజ్ టైం దగ్గర పడుతుండటంతో రెండు చోట్ల గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. చెన్నైలోనూ, హైదరాబాద్ లోనూ నెవర్ బిఫోర్ అనేలా దీన్ని ప్లాన్ చేస్తున్నారట. ఇది సరిపోదని, ఎలాగైనా ట్రైలర్ ను రిలీజ్ చేయమని బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు పట్టుబడుతున్నారట. ఇప్పటికే సినిమాపై ఓ రేంజ్ లో బజ్ ఉందని... దాన్ని మరింత క్యాష్ చేసుకోవాలంటే ట్రైలర్ రిలీజ్ చేస్తే బాగుంటుందని వారి వాదన అట! మరి సినిమా విడుదలకు నెల రోజులపైనే సమయం ఉంది కాబట్టి... మేకర్స్ ఎలాంటి డెసిషన్ ను తీసుకుంటారో చూడాలి.
Also Read: Hari Hara Veera Mallu: దర్శకుడు జ్యోతికృష్ణ ఎమోషనల్ పోస్ట్
Also Read: Atlee: మరోసారి పుష్పరాజ్ సరసన...
Also Read: Tollywood: అడ్డంగా బుక్కయిన టాలీవుడ్ సెలబ్రిటీస్