Atlee: మరోసారి పుష్పరాజ్ సరసన...
ABN , Publish Date - Jul 10 , 2025 | 11:52 AM
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన మరోసారి రశ్మిక నటించబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సోలోగా కాకుండా ముగ్గురు కథానాయికల్లో ఆమె కూడా ఒకరని తెలుస్తోంది.
నేషనల్ క్రష్ రశ్మిక మందణ్ణ (Rashmika Mandanna) మరోసారి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) సరసన నటించబోతోందనే వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. అల్లు అర్జున్ హీరోగా అట్లీ (Atlee) తెరకెక్కిస్తున్న సినిమాలో ఇప్పటికే ఇద్దరు హీరోయిన్లు ఫైనలైజ్ అయ్యారు. అందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోణె (Deepika Padukone) పేరును అధికారికంగానే ప్రకటించారు మేకర్స్. అలానే మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) సైతం ఇందులో మరో నాయికగా నటించబోతోందని సమాచారం. వీరిద్దరూ కాకుండా ఇందులో మూడో హీరోయిన్ కూ చోటు ఉందట. ఆ పాత్ర కోసం జాన్వీ కపూర్ ను గతంలో సంప్రదించారని తెలిసింది. కారణాలు ఏవైనా ఇప్పుడు ఆ పాత్రను ఆమె చేయడం లేదట. దాంతో ఈ థర్డ్ హీరోయిన్ కోసం రశ్మిక మందణ్ణను మేకర్స్ అప్రోచ్ అయ్యారట.
నిజానికి రశ్మిక మందణ్ణ ఇవాళ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నటి. 'పుష్ప, పుష్ప -2' చిత్రాల తర్వాత రశ్మిక నేషనల్ క్రష్ గా మారిపోయింది. 'యానిమల్, ఛావా' సినిమాలు ఆమె స్థాయిని ఇంకాస్తంత పెంచాయి. ఈ మధ్య వచ్చిన 'సికిందర్' కమర్షియల్ గా ఆడలేదు. అలానే మొన్నొచ్చిన 'కుబేర' సైతం ఆమెను నిరాశకు గురిచేసింది. అయినా రశ్మిక చేతిలో ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. పైగా అల్లు అర్జున్ సరసన 'పుష్ప', 'పుష్ప 2' చిత్రాలలో సోలో హీరోయిన్ గా నటించిన రశ్మిక ఇప్పుడు ఇలా ముగ్గురు కథానాయికల్లో ఒకరిగా చేస్తుందా? అనే సందేహాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు.
అల్లు అర్జున్ తో ఉన్న బాండింగ్, అట్లీ సినిమాలకు జాతీయ స్థాయిలో ఉన్న గుర్తింపు దృష్ట్యా ఆమె ఈ ఆఫర్ అంగీకరిచినా ఆశ్చర్య పోనక్కర్లేదు. అదే గనుక రశ్మిక చేస్తే... ఆమెకు పాత్ర, దాని నిడివి కంటే... వ్యక్తులతో, సంస్థలతో ఉన్న అనుబంధమే ఎక్కువ అనుకోవాల్సి వస్తుంది. ఏదేమైనా రశ్మిక పేరును అధికారికంగా ప్రకటించేవారు... వేచి చూడాల్సిందే!
Also Read: Mahavatar Narsimha: త్రీడీలో రాబోతున్న మహావతార్ నరసింహ
Also Read: Tollywood: అడ్డంగా బుక్కయిన టాలీవుడ్ సెలబ్రిటీస్