Priyanka Mohan new movie: కవిన్ సరసన ప్రియాంక...

ABN , Publish Date - Jul 17 , 2025 | 09:26 AM

అందాల భామ ప్రియాంక అరుల్ మోహన్ కిట్ లో మరో అవకాశం వచ్చి పడింది. ప్రముఖ తమిళ నటుడు కవిన్ సరసన ఆమె ఓ రొమాంటిక్ కామెడీ మూవీ చేయబోతోంది.

Priyanka Arul Mohan

మూడు పదుల వెన్నెల సోన ప్రియాంక అరుల్ మోహన్ (Priyanka Arul Mohan) కు ఇంకా గ్రాండ్ విక్టరీ దొరకలేదు. అయితే... తమిళంలో ఆమె నటించిన 'డాక్టర్ (Doctor), డాన్ (Don)' చిత్రాలు కొంతలో కొంత ఊరటను కలిగించాయి. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సరసన 'ఓజీ' (OG) లో నటిస్తోంది ప్రియాంక అరుల్ మోహన్. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న 'ఓజీ' పై అమ్మడు భారీ ఆశలే పెట్టుకుంది.


తెలుగులోనూ ఇప్పటికే నటిగా తన సత్తా చాటడానికి శతవిధాలా ప్రయత్నించింది. నానిస్ 'గ్యాంగ్ లీడర్'తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక... ఆ తర్వాత శర్వానంద్ సరసన 'శ్రీకారం'లో నటించింది. ఈ రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయితే 'గ్యాంగ్ లీడర్'లో ఆమె చేసిన పాత్ర మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. అందుకే మరోసారి నాని సరసన 'సరిపోదా శనివారం' (Saripoda Sanivaaram) లో ఛాన్స్ దక్కించుకుంది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ బరిలో మిస్ ఫైర్ అయింది.

A song that never fades from my playlist or my soul! Timeless favourite, always.📷 @aadhavkannad (1).jpg

ఇదిలా ఉంటే... ప్రియాంక అరుల్ మోహన్ కు ఇప్పుడో కొత్త ప్రాజెక్ట్ లభించింది. హీరో కవిన్ (Kavin) తొమ్మిదో చిత్రంలో ఆమె హీరోయిన్ గా నటించబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. కెన్ రాయ్ సన్ దర్శకత్వం వహించే ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కబోతోంది. థింక్ స్టూడియోస్ సంస్థ ఈ రొమాంటిక్ కామెడీ మూవీని ప్రొడ్యూస్ చేబోతోంది. 'కొత్త ప్రయాణం... కొత్త సినిమా' అంటూ వీరు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. కవిన్ సరసన ప్రియాంక తొలిసారి నటిస్తోంది. మరి సెప్టెంబర్ 25న రాబోతున్న 'ఓజీ'తో ప్రియాంక స్టార్ హీరోయిన్ కేటగిరిలోకి చేరిపోతుందేమో చూడాలి.

Also Read: Actress: సంచితా శెట్టికి గౌరవ డాక్టరేట్...

Also Read: Akhanda 2: అస్సలు తగ్గేదేలే.. ఓజీతో అఖండ యుద్దానికి సిద్ధం

Updated Date - Jul 17 , 2025 | 09:26 AM