సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Luxury Car Smuggling: పృథ్వీరాజ్‌, దుల్కర్‌ సల్మాన్‌ ఇళ్లల్లో సోదాలు..

ABN, Publish Date - Sep 23 , 2025 | 04:01 PM

మలయాళ నటులు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌(Prithviraj Sukumaran), దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan) ఇళ్లల్లో మంగళవారం కస్టమ్స్‌ అధికారులు సోదాలు నిర్వహించారు.

మలయాళ నటులు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌(Prithviraj Sukumaran), దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan) ఇళ్లల్లో మంగళవారం కస్టమ్స్‌ అధికారులు సోదాలు నిర్వహించారు. లగ్జరీ కార్ల స్మగ్లింగ్‌ ఆరోపణలకు సంబంధించి నమోదైన కేసుపై కస్టమ్స్‌ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ‘ఆపరేషన్‌ నమకూర్‌’ పేరుతో దేశవ్యాప్తంగా పలువురు నివాసాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కొచ్చి, తిరువనంతపురంలో ఉన్న పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఇళ్లతో పాటు, పనంపిల్లి నగర్‌లోని దుల్కర్‌ నివాసానికి వెళ్లి సోదాలు చేశారు. అయితే, వారి వద్ద నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి విలాసవంతమైన వాహనాలను గుర్తించలేదని చెప్పినట్లు సమాచారం.



కేవలం వీరి పైనే కాదు, కేరళ వ్యాప్తంగా కొచ్చి, మలప్పురం సహా వివిధ ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయి. ఇంటెలిజెన్స్‌ వర్గాలు ఇచ్చిన నివేదికల ప్రకారం.. భూటాన్‌ ఆర్మీ తన వాహనశ్రేణిలోని కొన్ని ఖరీదైన వాహనాలను ఉపసంహరించుకుంది. వాటిని కొందరు ఏజెంట్లు వేలంలో అతి తక్కువ ధరకు దక్కించుకున్నారు. వాటికి కస్టమ్స్‌ డ్యూటీ చెల్లించకుండా ఇండియాకు స్మగ్లింగ్‌ చేశారన్న సమాచారం బయటకు వచ్చింది. అత్యంత ఖరీదైన ఈ వాహనాలను హిమాచల్‌ ప్రదేశ్‌ మీదుగా భారత్‌లో కొన్ని తాత్కాలిక చిరునామాలకు తరలించారట.  

Updated Date - Sep 23 , 2025 | 04:17 PM