Prashanth Neel: నా దొంగ మొగుడు.. నీల్ భార్య క్యూట్ పోస్ట్ వైరల్
ABN , Publish Date - Oct 25 , 2025 | 04:49 PM
కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) గురించి తెలుగు ప్రేక్షకులకు సైతం పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
Prashanth Neel: కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) గురించి తెలుగు ప్రేక్షకులకు సైతం పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కెజిఎఫ్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా మారిన ప్రశాంత్ నీల్.. సలార్ సినిమాతో తెలుగు తెరకు పరిచయామయ్యాడు. ఇక ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్ తో డ్రాగన్ సినిమా చేస్తున్నాడు.
ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ అవుట్ ఫుట్ నచ్చక ఎన్టీఆర్.. నీల్ పై మండిపడినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా కొన్నిరోజులు వాయిదా పడిందని టాక్.
ఇక ఇదంతా పక్కన పెడితే .. నీల్ సినిమాలు అన్ని.. బొగ్గుతో నిండి ఉంటాయి. బ్లాక్ తప్ప నీల్ వేరే కలర్ డ్రెస్ లోనే కనిపించడు. తన హీరోలు కూడా ఎప్పుడు బ్లాక్ డ్రెస్ లోనే కనిపిస్తూ ఉంటారు. తనకు బ్లాక్ అంటే ఇష్టమని, అందుకే ఎక్కువ నలుపు వాడతానని నీల్ నే డైరెక్ట్ గా చెప్పుకొచ్చాడు. సినిమాల్లోనే కాదు బయట కూడా నీల్ ఎక్కువ బ్లాక్ డ్రెస్ ల్లోనే కనిపించాడు.
తాజాగా నీల్ బ్లాక్ నుంచి వైట్ కి మారాడు. తాజాగా సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ వివాహానికి ప్రశాంత్ నీల్ అతని భార్య లిఖితా హాజరయ్యారు. ఇక ఈ వివాహానికి నీల్ వైట్ అండ్ వైట్ డ్రెస్ లో కనిపించాడు. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలను లిఖిత.. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ' చివరికి.. నా దొంగ మొగుడు వైట్ లో కనిపించాడు' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇక ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. అయ్యా బాబోయ్.. నీల్ మావా వైట్ డ్రెస్ లో కనిపించడం అంటే విడ్డూరమే అని కామెంట్స్ పెడుతున్నారు.
Rana Daggubati: తండ్రి కాబోతున్న మరో యంగ్ హీరో..
Rahul Ravindran: హాస్టల్‌లో జరిగిన చిన్న సంఘటన ఈ సినిమాకు పునాది