సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Prakashraj Comments: నేషనల్‌ అవార్డులపై ప్రకాశ్‌రాజ్‌ కీలక వ్యాఖ్యలు..

ABN, Publish Date - Nov 04 , 2025 | 10:43 AM

తాజాగా 55వ కేరళ స్టేట్‌ ఫిల్మ్‌ (Kerala State Award) అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే.  ప్రకటించిన అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఛైర్‌పర్సన్‌ ప్రకాశ్‌ రాజ్‌ (Prakash raj) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

Prakash Raj

తాజాగా 55వ కేరళ స్టేట్‌ ఫిల్మ్‌ (Kerala State Award) అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే.  ప్రకటించిన అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఛైర్‌పర్సన్‌ ప్రకాశ్‌ రాజ్‌ (Prakash raj) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2024 నుంచి  కేరళ స్టేట్‌ ఫిల్మ్‌ అవార్డుల జ్యూరీకి ఆయన ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు. తాజాగా జాతీయ అవార్డులపై వైరల్‌ కామెంట్స్‌ చేశారాయన.

‘నేషనల్‌ అవార్డుల విషయంలో జ్యూరీ మెంబర్స్‌ రాజీ పడుతున్నారని చెప్పడానికి నేను భయపడను. కేరళ స్టేట్‌ అవార్డ్స్‌  జ్యూరీ ఛైర్మన్‌గా వ్యవహరించడం సంతోషంగా ఉంది. కమిటీ వారు నాకు ఫోన్‌ చేసి కేరళకు చెందినవారు కాకుండా బయటి వ్యక్తులు, నటనలో అనుభవం ఉన్నవారు జ్యూరీ ఛైర్మన్‌గా ఉండాలని కోరారు. దాంతో అంగీకరించాను. కమిటీ సభ్యులు అవార్డుల ఎంపిక విషయంలో జోక్యం చేసుకోబోమని, పూర్తి స్వేచ్ఛ ఇస్తామని మొదటి రోజే చెప్పారు. ఎలాంటి పక్షపాతం లేకుండా ఉండేందుకు వాళ్లు తీసుకున్న నిర్ణయం నచ్చి నేను అంగీకరించాను. కానీ  జాతీయ అవార్డుల విషయంలో అలా జరగట్లేదు. కొందరికి మాత్రమే అవార్డులు వస్తున్నాయి. జ్యూరీలో అలాంటి విధానాలు ఉన్నప్పుడు, రాజీ పడుతున్నప్పుడు మమ్ముట్టి లాంటి గొప్ప వ్యక్తులకు ఇలాంటి అవార్డులు అవసరం లేదు’ అని ప్రకాశ్‌ రాజ్‌ కామెంట్స్‌ చేశారు.

ALSO READ: Kerala State Film Awards 2025: అదరగొట్టిన మంజుమ్మెల్ బాయ్స్.. ఏకంగా 9 అవార్డ్స్


Updated Date - Nov 04 , 2025 | 11:47 AM