Kerala State Film Awards 2025: అదరగొట్టిన మంజుమ్మెల్ బాయ్స్.. ఏకంగా 9 అవార్డ్స్

ABN , Publish Date - Nov 03 , 2025 | 08:12 PM

55 వ కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్ (Kerala State Film Awards 2025) ను ప్రభుత్వం ప్రకటించింది. 2024 లో మంచి ప్రతిభ చూపిన నటీనటులకు, ప్రజాదరణ పొందిన సినిమాలకు అవార్డులు దక్కాయి.

Kerala State Film Awards

Kerala State Film Awards 2025: 55 వ కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్ (Kerala State Film Awards 2025) ను ప్రభుత్వం ప్రకటించింది. 2024 లో మంచి ప్రతిభ చూపిన నటీనటులకు, ప్రజాదరణ పొందిన సినిమాలకు అవార్డులు దక్కాయి. ఇక ఈసారి అవార్డుల్లో మంజుమ్మెల్ బాయ్స్ (Manjummel Boys))అదరగొట్టేసింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 9 అవార్డ్స్ ను కైవసం చేసుకొని రికార్డ్ సృష్టించింది. ఇక ఉత్తమ నటుడిగా మమ్ముట్టి.. ఉత్తమ నటిగా షామ్లా హజ్మా ఎంపిక అయ్యారు. ముఖ్యంగా 9 కేటగిరీల్లో మంజుమ్మెల్ బాయ్స్ ఎంపిక అవ్వడం మలయాళ ఇండస్ట్రీనే షాక్ కు గురి చేసింది. నటుడు ప్రకాష్ రాజ్ నేతృత్వంలో ఆరుగురు కమిటీ సభ్యులతో ఈ లిస్ట్ తయారయ్యింది.

కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్.. విజేతలు వీరే

ఉత్తమ చిత్రం : మంజుమ్మెల్ బాయ్స్

ఉత్తమ నటుడు: మమ్ముట్టి (భ్రమయుగం)

ఉత్తమ నటి : షమ్లా హంజా (ఫెమినిచి ఫాతిమా)

ఉత్తమ దర్శకుడు : చిదంబరం ఎస్ పొదువల్ (మంజుమ్మెల్ బాయ్స్)

ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్టు (మేల్): సౌబిన్ షాహిర్, సిద్ధార్థ్ భరతన్ (మంజుమ్మెల్ బాయ్స్)

ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ (ఫిమేల్) : లిజోమోల్ జోస్ (నాదన్న సంభవం)

ఉత్తమ స్క్రీన్ ప్లే: చిదంబరం ఎస్ పొదువల్ (మంజుమ్మెల్ బాయ్స్)

ఉత్తమ సంగీత దర్శకుడు : సుషీన్ శ్యామ్ (మంజుమ్మెల్ బాయ్స్)

ఉత్తమ తెలుగు దర్శకుడు : ఫాసిల్ మొహమ్మద్ (ఫెమినిచి ఫాతిమా)

ఉత్తమ విఎఫ్ఎక్స్ - ARM

ఉత్తమ సినిమాటోగ్రఫీ : షైజు ఖలీద్ (మంజుమ్మెల్ బాయ్స్)

ఉత్తమ సినిమా పుస్తకం : స్టార్ ఆక్రేసన్ (రచయిత సి మీనాక్షి)

ఉత్తమ కళా దర్శకుడు : అజయన్ చలిస్సేరి (మంజుమ్మెల్ బాయ్స్)

ఉత్తమ నేపథ్య గాయని : జెబా టామీ

ఉత్తమ గాయకుడు : కేఎస్ హరిశంకర్

ఉత్తమ కథా రచయిత : ప్రసన్న వితనగే (పారడైజ్)

ఉత్తమ సాహిత్యం : వేదన్ (మంజుమ్మెల్ బాయ్స్)

ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్టు: వైకోమ్ భాసి

ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ : సమీరా సనీష్

ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ : రోనెక్స్ జేవియర్

స్పెషల్ జ్యూరీ అవార్డు: పారడైజ్

స్పెషల్ జ్యూరీ అవార్డు : ఆసిఫ్ అలీ, టోవినో థామస్, దర్శన రాజేంద్రన్, జ్యోతిర్మయి.

ఉత్తమ ప్రజాధారణ పొందిన చిత్రం - ప్రేమలు

Updated Date - Nov 03 , 2025 | 08:12 PM