Prabhu Deva: బిగ్ స్క్రీన్ నుంచి వెబ్ స్క్రీన్‌కి ప్రభుదేవా

ABN , Publish Date - Sep 17 , 2025 | 06:02 PM

సినిమా అంటే బిగ్ స్క్రీనే అన్న థాట్స్ ఎప్పుడో పోయాయి.. అంతకు మించి మీడియంగా ఓటీటీ మారిపోయింది. అందరూ తమ లక్ ని పరీక్షించుకున్నట్టే.. ఇప్పుడు మరో సెలబ్రెటీ కూడా అందులో అడుగుపెట్టాడు.

ఓటీటీ (OTT)లు వచ్చాక సినిమా ఇండస్ట్రీ తీరే మారిపోయింది. బిగ్ స్క్రీన్ పైనే కాదు.. స్మాల్ స్క్రీన్ వాల్యూ పెరిగిపోయింది. స్టారాధి స్టారులు కూడా వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు. ఏ మాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పేస్తున్నారు. ఇప్పటికే ఈ జాబితాలో చాలా మంది చేరగా.. ఇప్పుడు డాన్సర్, కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడిగా తన సత్తా చాటిన ప్రభుదేవా (Prabhu Deva) కూడా ఎంట్రీ ఇచ్చాడు.


ఇప్పుడు తమిళ వెబ్ సిరీస్ 'సేతురాజన్ ఐపీఎస్' (Sethuraajan IPS) తో ఓటీటీ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. తమిళనాడు గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ సిరీస్‌లో ప్రభుదేవా సేతురాజన్ ఐపీఎస్‌గా కనిపించనున్నాడు. రాజకీయంగా సున్నితమైన ఒక హత్య కేసును ఛేదించే పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆయన నటిస్తున్నాడు.

సోనీ లివ్‌ (Sony Liv) లో స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్ ఫస్ట్ లుక్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. సేతురాజన్ ఐపీఎస్ గా నటించడం ఎంతో ఛాలెంజింగ్ గా అనిపించిందని ప్రభుదేవా చెప్పాడు. ఈ కథ కేవలం సమయానుగుణమే కాదు, అవసరమైనది కూడా అని అభిప్రాయపడ్డాడు .ఇటీవల ప్రభుదేవా కీత్ గేమ్స్ దర్శకత్వంలో 'బాడాస్ రవికుమార్' (Badass Ravikumar) అనే మ్యూజికల్ స్పూఫ్ యాక్షన్ ఫిల్మ్‌లో కనిపించారు. ఆ తర్వాత మళ్లీ స్క్రీన్ పై కనిపించడం ఇదే . మరి ఈ కొత్త రోల్ ప్రభుదేవాకు ఎలాంటి రెస్పాన్స్ తెస్తుందో చూడాలి..

Read Also: Mahesh -Little Hearts : సూపర్ స్టార్ టచ్‌తో ‘లిటిల్ హార్ట్స్’కి బిగ్ బూస్ట్

Read Also: Disha Patani Yogi Adityanath: ఎంతటి వారైనా.. వ‌దిలేది లేదు

Updated Date - Sep 17 , 2025 | 06:03 PM