Kollywood: పూజా కిట్ లో మరో తమిళ మూవీ

ABN , Publish Date - Jul 05 , 2025 | 10:34 AM

హీరో ధనుష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది. ఇప్పటికే విజయ్, రాఘవేంద్ర లారెన్స్ మూవీస్ లో నటిస్తున్న పూజా... రజనీకాంత్ కూలీలో స్పెషల్ సాంగ్ లో నర్తించింది.

పొడుగు కాళ్ళ సుందరి పూజా హెగ్డే (Pooja Hegde) కెరీర్ కు ఇక ఫుల్ స్టాప్ పడిపోయినట్టు అనుకుంటున్నప్పుడల్లా ఫీనిక్స్ పక్షిలా ఉవ్వెత్తున పైకి లేస్తోంది. గత కొంతకాలంగా పూజా హెగ్డే నటించిన సినిమాలేవీ బాక్సాఫీస్ బరిలో సందడి చేయలేదు. దాంతో ఆమెకు అవకాశాలు సన్నగిల్లాయి. ఇక పూజా తట్టాబుట్టా సర్దుకోవడమే తరువాయి అనుకుంటున్న టైమ్ లో మళ్ళీ చిత్రంగా ఆమెకు స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి.


ప్రస్తుతం పూజా హెగ్డే... తమిళ స్టార్ హీరో విజయ్ (Vijay) నటిస్తున్న 'జన నాయగన్' (Jana Nayagan) లో హీరోయిన్ గా నటిస్తోంది. అలానే సౌతిండియన్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) 'కూలీ' (Coolie) లో స్పెషల్ సాంగ్ లో నర్తించింది. వీటితో పాటు రాఘవేంద్ర లారెన్స్ 'కాంచన -4' (Kanchana -4)లోనూ పూజా నటిస్తోంది. తాజాగా జాతీయ ఉత్తమ నటుడు ధనుష్‌ (Dhanush) 54వ సినిమాలోనూ ఆమె హీరోయిన్ గా ఎంపికయినట్టు తెలుస్తోంది. విఘ్నేష్ రాజా దర్శకత్వంలో ఈ సినిమాను వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మిస్తోంది. ఈ పిరియాడిక్ యాక్షన్ డ్రామా ను ఈ నెల రెండో వారంలో సెట్స్ పైకి తీసుకెళ్ళి 90 రోజులలో పూర్తి చేస్తారని తెలుస్తోంది.

Also Read: Tv Movies: తెలుగు టీవీల్లో.. శ‌నివారం వ‌చ్చే సినిమాలివే

Also Read: Sarzameen: అందరి దృష్టి స్టార్ కిడ్ పైనే...

Updated Date - Jul 05 , 2025 | 10:34 AM