సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Sathyaraj Vs Pawan Kalyan: తమిళులు తెలివైనవారు.. మీ ఆటలు సాగ‌వు ప‌వ‌న్ క‌ల్యాణ్‌

ABN, Publish Date - Jun 25 , 2025 | 08:04 PM

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై మ‌రో న‌టుడు ద్వ‌జ‌మెత్తాడు.

pawan kalyan sathyaraj

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)పై మ‌రో న‌టుడు ద్వ‌జ‌మెత్తాడు. బాహుబలి సినిమాలో క‌ట్ట‌ప్ప పాత్ర‌తో అంద‌రికీ సుప‌రిచిత‌మైన త‌మిళ‌ నటుడు సత్యరాజ్(కట్టప్ప) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అయితే ఇది సినిమాల విష‌యంలో కాదు రాజ‌కీయాల విష‌యంలో. ఇటీవ‌ల త‌మిళ‌నాడు ప‌ర్య‌ట‌నకు వెళ్లిన ప‌వన్ మదురైలో నిర్వహించిన మురుగ‌న్ భ‌క్తుల‌ మానాడు స‌మావేశంలో ప్ర‌సంగించారు. ఆపై అధికార డీఎంకే పార్టీపై తీవ్ర‌ విమ‌ర్శ‌లు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది. నాస్తికులకు ఏ దేవుడినీ నమ్మాల్సిన అవసరం లేదని.. కానీ మన దేశంలో నాస్తికులు హిందువుల‌ను ఎంపిక చేసుకుని టార్గెట్ చేస్తున్నారు అంటూ పవన్ కామెంట్స్ చేశారు.

దీంతో అక్క‌డి పార్టీ నాయ‌కులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ముఖ్యంగా దేవుడి పేరుతో తమిళనాడులో పవన్ కల్యాణ్ రాజకీయాలు చేస్తే ఊరుకోమంటూ తాజాగా సత్యరాజ్ (Sathyaraj) హెచ్చరించారు. వీసీకే పార్టీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ.. మ‌తం పేరుతో ఓట్లు దండుకోవాల‌ని చూస్తే ఇక్క‌డ కుద‌ర‌ద‌న్నారు. పెరియార్ సిద్ధాంతాలను నమ్మే మమ్మ‌ల్ని ఎవరూ మోసం చేయలేర‌ని, మీరు పాల్గొన్న‌ స‌భ‌తో మ‌మ్మ‌ల్ని మోసం చేశారు అనుకుంటే అది మీ తెలివి త‌క్కువ త‌నమే అని, తమిళ ప్ర‌జ‌లు తెలివైనవార‌ని ఇక్క‌డ‌ మీ ఆటలు అస‌లు సాగవంటూ పవన్ కల్యాణ్ ను సత్యరాజ్ విమ‌ర్శించారు. ఇదిలా ఉంటే.. ప‌వ‌న్ క‌ల్యాణ్ రాబోవు చిత్రం హారిహార వీర‌మ‌ల్లు చిత్రంలో స‌త్య‌రాజ్ కీల‌క పాత్ర‌లో న‌టించ‌డం గ‌మ‌నార్హం.

Updated Date - Jun 25 , 2025 | 08:16 PM