సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Jailer 2: నిన్న తమన్నా.. నేడు నోరా ఫతేహీ! కొత్త ఐటం.. పాప వ‌చ్చేసింది

ABN, Publish Date - Dec 17 , 2025 | 12:37 PM

రజనీకాంత్ 'జైలర్ 2'లో నోరా ఫతేహీ ఐటమ్ సాంగ్ లో నర్తిస్తోంది. ప్రస్తుతం దీని చిత్రీకరణ జరుగుతోంది. వచ్చే యేడాది జూన్ లో 'జైలర్ 2' జనం ముందుకు రానుంది.

Nora Fatehi

సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajini Kanth) నటించిన 'జైలర్' (Jaile) సినిమా 2023లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ సినిమా విజయంలో మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah) ఐటమ్ సాంగ్ కూడా ఓ ప్రధాన కారణం. 'కావాలి రా' అంటూ తమన్నా వేసిన స్టెప్స్ కుర్రకారును ఉర్రూతలూగించాయి. సోషల్ మీడియాలో ఆ మూవీ స్టెప్స్ విపరీతంగా వైరల్ అయ్యాయి.

అయితే... ఇప్పుడు 'జైలర్ 2' (Jailer 2) లో మాత్రం తమన్నాను కాకుండా ఐటమ్ సాంగ్ కు నోరా ఫతేహీ (Nora FAtehi) ని తీసుకున్నారు. ప్రస్తుతం దర్శకుడు నెల్సన్ ఈ ప్రత్యేక గీతాన్ని చిత్రీకరిస్తున్నాడు. నోరా ఫతేహీ తెలుగువారికి కూడా సుపరిచితురాలే. 'టెంపర్ (temper), బాహుబలి (Baahubali), కిక్ 2, షేర్ (Sher), లోఫర్, ఊపిరి (Oopiri)' వంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో నర్తించింది. గత యేడాది వరుణ్‌ తేజ్ 'మట్కా'లోనూ నోరా ఫతేహీ ఓ స్పెషల్ సాంగ్ లో నర్తించింది.


దాదాపు 20 స్పెషల్ సాంగ్స్ ను నోరా ఫతేహీ చేసింది. నోరా ఫతేహీని తీసుకుంటే ఉత్తరాదిలో కలిసి వస్తుందని 'జైలర్ 2' మేకర్స్ భావించినట్టున్నారు. ఎనిమిది రోజుల పాటు ఈ పాట షూట్ జరుగబోతోంది. ఇందులో రజనీకాంత్ కూడా పాల్గొంటున్నారు. 'జైలర్ 2' సినిమా వచ్చే యేడాది జూన్ లో రిలీజ్ చేయబోతున్నారు. ఇతర ప్రధాన పాత్రలను రమ్యకృష్ణ, ఎస్.జె. సూర్యచ చేస్తుండగా, శివరాజ్ కుమార్ (Shiva Rajkumar), మోహన్ లాల్ (Mohan Lal), మిథున్ చక్రవర్తి (Mithun Chakraborty) అతిథి పాత్రలలో కనువిందు చేయబోతున్నారు. ఈ సినిమాకు అనిరుథ్ రవిచందర్ (Anirudh Ravichander) సంగీతం అందిస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ దీనిని నిర్మిస్తోంది.

Also Read: Kedi KIan Kumar: ఇండ‌స్ట్రీలో విషాదం.. ప్ర‌ముఖ టాలీవుడ్ ద‌ర్శ‌కుడు హఠాన్మరణం

Also Read: TFCC: ఛాంబర్ ఎన్నికలు... నామినేషన్స్ ప్రక్రియ పూర్తి...

Updated Date - Dec 17 , 2025 | 08:14 PM