TFCC: ఛాంబర్ ఎన్నికలు... నామినేషన్స్ ప్రక్రియ పూర్తి...

ABN , Publish Date - Dec 17 , 2025 | 11:56 AM

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు డిసెంబర్ 28న జరుగుబోతున్నాయి. ఈ సందర్భంగా నాలుగు సెక్టార్లకు సంబంధించిన అభ్యర్థుల నామినేషన్స్ ప్రక్రియ పూర్తయ్యింది.

Telugu film chamber

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ (Telugu Film Chamber) ఎన్నికలు ఈ నెల 28వ తేదీ ఉదయం 8.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకూ హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ లో జరుగుబోతున్నాయి. ఎన్నికల నిర్వహణాధికారిగా దుర్గాప్రసాద్ వ్యవహరిస్తున్నారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లోని నాలుగు విభాగాల నుంచి జరగనున్న కార్యనిర్వాహక సభ్యుల ఎన్నిక ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో నామినేషన్స్ ప్రక్రియ సక్రమంగా పూర్తయ్యింది. అభ్యర్థుల ఉపసంహరణ గడువడు 19వ తేదీ వరకూ ఉంది. 20వ తేదీన బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల అధికారి ప్రకటిస్తారు.


స్టూడియో సెక్టార్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి మొత్తం నాలుగు పోస్టులు ఉండగా, ఈసారి ఎనిమిది మంది నామినేషన్స్ దాఖలు చేశారు. అలానే స్టూడియో సెక్టార్ కౌన్సిల్ లో ఏడు పోస్టులున్నాయి. దానికి 12 మంది నామినేషన్లు వేశారు. ఎగ్జిబిటర్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి మొత్తం 16 పోస్టులు ఉండగా, 29 మంది నామినేషన్స్ వేశారు, అలాగే ఎగ్జిబిటర్ సెక్టార్ కౌన్సిల్ కు 40 పోస్టులు ఉండగా, 21 మంది మాత్రమే నామినేషన్లు దాఖలు చేయటం విశేషం. ఇక డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి 12 పోస్టులు ఉండగా, 30 మంది నామినేషన్స్ వేశారు. డిస్ట్రిబ్యూటర్స్ సెక్టార్ కౌన్సిల్ కు 20 పోస్టులు ఉండగా, 34 మంది నామినేషన్స్ వేశారు. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి 12 పోస్టులు ఉండగా, 36 మంది నామినేషన్స్ వేశారు. అలానే ప్రొడ్యూసర్స్ సెక్టార్ కౌన్సిల్ కు 20 పోస్టులు ఉండగా, 32 మంది నామినేషన్స్ వేశారు. 19వ తేది ఉపసంహరణ గడువు పూర్తి అయిన తర్వాత వీరిలో బరిలో ఉండేదెవరు, నామినేషన్స్ విత్ డ్రా చేసుకోనేది ఎవరు… ఎవరెవరు ప్యానెల్స్ గా బరిలో దిగుతారనే అంశంపై క్లారిటీ వచ్చే ఆస్కారం ఉంది.


డిసెంబర్ 28వ తేదీ మధ్యాహ్నం 1.00 గంటలకు ఎన్నికలు పూర్తి కాగానే ఓట్ల లెక్కింపు జరిపి విజేతలను ప్రకటిస్తారు. ఈ సారి ఎగ్జిబిటర్స్ సెక్టార్ కు చెందిన వ్యక్తిని ఛాంబర్ ప్రెసిడెంట్ గా ఎంపిక చేయనున్నారు. మరి ఎగ్జిబిటర్స్ సెక్టార్ నుంచి ఎవరు ఛాంబర్ అధ్యక్షుడు అవుతారో చూడాలి.

Also Read: Homebound Oscars: ఆస్కార్ చేరువ‌లో.. భార‌త సినిమా ‘హోమ్‌బౌండ్‌’! షార్ట్ లిస్టులో చోటు

Also Read: Rishab Shetty: రణ్‌వీర్‌.. అలా చేయడం ఇబ్బందిగా అనిపించింది

Updated Date - Dec 17 , 2025 | 11:56 AM