South Actors: గోవాలో అలనాటి తారల సందడి
ABN , Publish Date - Jul 30 , 2025 | 12:03 AM
దక్షిణాదికి చెందిన తొంభైల నాటి తారలు గోవాలో ఇటీవల రీ-యూనియన్ పార్టీ జరుపుకున్నారు. బీచ్ సైడ్ రీసార్ట్ లో ఫుల్ గా ఎంజాయ్ చేశారు.
ఒకే స్కూల్ లో చదువుకున్న పూర్వ విద్యార్థులు, ఒకే కాలేజీలో చదువుకు స్టూడెంట్స్ పదేళ్ళకో, పాతికేళ్ళకో ఒకసారి కలుసుకుని అప్పటి విశేషాలను తలుచుకోవడం, ఆనాటి సంఘటనలను నెమరవేసుకోవడం సహజం. విశేషం ఏమంటే సినిమా తారలూ అందుకు మినహాయింపు కాదు. చిరంజీవి (Chirajeevi), బాలకృష్ణ (Balakrishna), నాగార్జున (Nagarjuna), వెంకటేశ్ (Venkatesh) వంటి స్టార్స్ సౌతిండియాలోని తమ సమకాలీనులతో కలిసి ఎయిటీస్ రీ-యూనియన్ పేరుతో గెట్ టు గెదర్ నిర్వహిస్తుంటారు. ఒక్కోసారి ఒక్కో థీమ్ ను పెట్టుకుని దానికి తగ్గట్టుగా డ్రసులు వేసుకుంటారు. హాయిగా మంచి పార్టీ జరుపుకుంటారు.
విశేషం ఏమంటే బహుశా ఇదే స్ఫూర్తితో కావచ్చు... తొంభైల నాటి తారలు సైతం ఇలాంటి ఓ రీ-యూనియన్ ను ఇటీవల గోవాలో జరుపుకున్నారు. ఇందులో అప్పటి హీరోలు, హీరోయిన్లు మాత్రమే కాదు... దర్శకులు సైతం హాజరయ్యారు. ఈ తొంభై దశకం వెండితెర హీరోలు, హీరోయిన్ల రీ-యూనియన్ లో జగపతిబాబు (Jagapathi Babu), శ్రీకాంత్ (Srikanth), ప్రభుదేవా (Prabhudeva), కె.ఎస్. రవికుమార్, శంకర్, లింగుస్వామి, మోహన్ రాజా తదితరులు పాల్గొన్నారు. అలానే అలనాటి అందాల భామలు మీనా (Meena), సిమ్రాన్ (Simran), ఊహ, సంఘవి, మాళవిక, సంగీత, రీమాసేన్, మహేశ్వరి, శివరంజనీ ఈ పార్టీకి హాజరయ్యారు. వీరంతా గోవాలో బీచ్ పార్టీలో ఫుల్ ఎంజాయ్ చేశారు. ఉషోదాయాలను, సాయం సంధ్యలను ఎంచక్కా తమ తోటి నటీనటులతో కలిసి ఫోటోలు దిగి, ప్రతి ఒక్కరూ రీ-బూట్ అయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో మంగళవారం నుండి చక్కర్లు కొడుతున్నాయి.
Also Read: Rajinikanth: తెలుగులోనూ వచ్చిన పవర్ హౌస్ సాంగ్...
Also Read: Vijay Devarakonda: 'కింగ్ డమ్' కు భారీ ఓపెనింగ్స్ ఖాయం