Nayanthara: నయనతార చాలా కాస్ట్లీ.. ఒక్క సెకన్ కు ఎంతో తెలుసా
ABN, Publish Date - Jul 12 , 2025 | 09:43 AM
నేటితరం నాయికలు.. కెరీర్ విషయంలో కాస్త అడ్వాన్స్‌గా ఆలోచిస్తుంటారు. అలాగే ఫినాన్షియల్‌గా కూడా అలెర్ట్‌గా ఉంటారు. అంటే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నది వారి పాలసీ. నయనతార పారితోషికం తెలిస్తే షాక్ అవుతారు
నేటితరం నాయికలు.. కెరీర్ విషయంలో కాస్త అడ్వాన్స్‌గా ఆలోచిస్తుంటారు. అలాగే ఫినాన్షియల్‌గా కూడా అలెర్ట్‌గా ఉంటారు. అంటే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నది వారి పాలసీ. అదే అమలు పరుస్తున్నారు కూడా. లేడీ సూపర్‌స్టార్ నయనతార (Nayanthara) ఈ విషయంలో చాలా కట్టుదిట్టంగా ఉంటారు. ఆమెకు ఫిన్సాన్సియల్ డిసిప్లేన్ చాలా ఎక్కువని ఆమె సన్నిహితులు తరచూ చెబుతుంటారు. కేరళలో మారుమూల ప్రాంతంలో ఓ సాధారణ కుటుంబంలో పుట్టి నటిగా చిన్న పాత్రలతో కెరీర్ మొదలుపెట్టి ఇప్పుడు లేడీ సూపర్‌స్టార్ అనే స్థాయిలో ఉంది. ఇప్పుడు దక్షిణాదిలో అగ్ర కథానాయికగా వెలుగొందుతుంది. ఇప్పుడు ఆమె ఇద్దరు పిల్లలకు నటి అయినా నటిగా, నిర్మాతగా దూసుకెళ్తున్నారు. ఇప్పటికీ స్టార్ హీరోలతో ఆమె జత కడుతోంది. Nayanthara remunaration)
ప్రస్తుతం ఆమె ఓ సినిమాకు రూ.10 కోట్ల వరకూ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోందని చాలాకాలంగా టాక్ నడుస్తోంది. తాజాగా 50 సెకన్ల నిడివి గల టాటా స్కై బిజినెస్ యాడ్‌లో నటించడానికి రూ.5 కోట్లు పారితోషికం తీసుకుందట. ఒక సెకన్ పారితోషకం అక్షరాల రూ.10 లక్షలు అన్నమాట. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నయనతార యాడ్స్ చాలా అరుదుగా చేస్తుంటారు. ఏదైనా ప్రొడక్ట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించినప్పుడు మాత్రమే యాడ్స్ చేస్తారు. ఇప్పుడు ఆమె చేసిన ఈ యాడ్, దాని పారితోషికం చూసి సినిమా ఇండస్ట్రీలో పలువురు షాక్ అయ్యారు. హీరోలు సైతం యాడ్ కోసం ఇంత రెమ్యునరేషన్ తీసుకోరని, నయన్ చాలా కాస్ల్టీ అని అంటున్నారు. ప్రస్తుతం ఆమెకు సరైన విజయం సాధించిన సినిమా ఏదీ లేదు. కానీ ఆఫర్లతో దూసుకెళ్తున్నారు. క్రేజ్ కూడా ఏ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ఆమె తెలుగులో చిరంజీవి సరసన అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న mega 157 చిత్రంలో నటిస్తున్నారు.