సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Nani: టూరిస్ట్ ఫ్యామిలీ డైరెక్టర్ ని ప్రశంసించిన న్యాచురల్ స్టార్ 

ABN, Publish Date - Jun 14 , 2025 | 03:50 PM

ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో ఎలాంటి హడావిడి  లేకుండా వచ్చి భారీ హిట్ అందుకున్న చిత్రాల్లో టూరిస్ట్ ఫ్యామిలీ(Tourist Family) ఒకటి.

Tourist Family

Nani:  ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో ఎలాంటి హడావిడి  లేకుండా వచ్చి భారీ హిట్ అందుకున్న చిత్రాల్లో టూరిస్ట్ ఫ్యామిలీ(Tourist Family) ఒకటి. కోలీవుడ్ సీనియర్ హీరో శశి కుమార్(Sasi Kumar), సిమ్రాన్(Simran) జంటగా కుర్ర డైరెక్టర్ అభిషన్ జీవింత్(Abishan Jeevinth) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 29 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది.  తమిళ్ లోనే రిలీజ్ అయిన టూరిస్ట్ ఫ్యామిలీ.. పాన్ ఇండియా సినిమాలుగా రిలీజ్ అయిన హిట్ 3 (Hit 3),  రెట్రో(Retro) సినిమాలను కూడా వెనక్కి నెట్టి  రికార్డ్ కలక్షన్స్ ను రాబట్టింది.

 

ఇక టూరిస్ట్ ఫ్యామిలీ తెలుగు వెర్షన్ థియేటర్ లో రిలీజ్ కాకపోయినా.. ఓటీటీలో అన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్ లోనే కాదు ఓటీటీలో కూడా ఈ సినిమా దుమ్మురేపింది. ప్రేక్షకులను మాత్రమే కాకుండా సెలబ్రిటీలను కూడా టూరిస్ట్ ఫ్యామిలీ ఫిదా చేసింది. దర్శక ధీరుడు రాజమౌళి(Rajamouli) సైతం టూరిస్ట్ ఫ్యామిలీపై ప్రశంసలు కురిపించాడు అంటే అర్ధం చేసుకోవచ్చు.

 

 ఇక తాజాగా న్యాచురల్ స్టార్ నాని(Natural Star Nani) కూడా టూరిస్ట్ ఫ్యామిలీని వీక్షించి.. సినిమాపై ప్రశంసలు కురిపించాడు.  టూరిస్ట్ ఫ్యామిలీ డైరెక్టర్ అభిషన్ జీవింత్ ను కలిసి మరీ సినిమా గురించి మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్నీ డైరెక్టర్ అభిషన్ జీవింత్.. సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు" ఎంతో అద్భుతమైన  రోజు ఇది. నాని సార్.. మిమ్మల్ని కలవడం నిజంగా గౌరవంగా భావిస్తున్నాను. మీరు చాలా వినయం కలిగిన వ్యక్తి. నా సినిమా గురించి ఇంత వివరంగా మీరు చెప్పిన విధానం నాకు మరింత ప్రత్యేకంగా మారింది.  థాంక్యూ సర్ " అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

 

 Lokesh Kanagaraj: హీరోగా ఎంట్రీ ఇస్తున్న స్టార్ డైరెక్టర్..?


ఇక టూరిస్ట్ ఫ్యామిలీ కథ గురించి అందరికీ తెల్సిందే. శ్రీలంక నుంచి ఒక కుటుంబం ఇండియాకు శరణార్థులుగా వస్తారు. ఎవరికీ  తాము శ్రీలంక నుంచి వచ్చామని చెప్పకుండా ఒక కాలనీలో అద్దెకు దిగుతారు. ఆ కాలనీలో ఉన్నవారందరికీ తమవంతు సాయం చేస్తూ ఉంటాడు హీరో.  అయితే వారు వచ్చిన సమయంలోనే రామేశ్వరంలో ఒక బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. ఆ బ్లాస్ట్ చేసిన కుటుంబం హీరో ఫ్యామిలీనే అని పోలీసులు వెతుకుతూ ఉంటారు. చివరకు  పోలీసులు హీరో ఫ్యామిలీని పట్టుకుంటారా..? ఆ కాలనీ అంతా హీరోకు సపోర్ట్ చేసారా .. ? అనేది కథ. ఇక టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా జిఓ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. 

Updated Date - Jun 14 , 2025 | 03:50 PM