Lokesh Kanagaraj: హీరోగా ఎంట్రీ ఇస్తున్న స్టార్ డైరెక్టర్..?

ABN , Publish Date - Jun 14 , 2025 | 03:02 PM

ఇండస్ట్రీలో స్టార్ హీరోలు డైరెక్టర్స్ గా మారినవారు ఉన్నారు. కానీ, డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి హీరోగా మారినవారు చాలా తక్కువమంది ఉన్నారు.

Lokesh Kanagaraj

Lokesh Kanagaraj:  ఇండస్ట్రీలో స్టార్ హీరోలు డైరెక్టర్స్ గా మారినవారు ఉన్నారు. కానీ, డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి హీరోగా మారినవారు చాలా తక్కువమంది ఉన్నారు. తాజాగా ఒక స్టార్ డైరెక్టర్.. హీరోగా మారుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.  ఆ డైరెక్టర్ ఎవరో కాదు లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj). కోలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో లోకేష్ ఒకరు. నగరం అనే సినిమాతో డైరెక్టర్ గా కెరీర్ ను మొదలుపెట్టిన లోకేష్.. ఖైదీ(Khaidi) సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాతో అటు తమిళ్ ప్రేక్షకులనే కాకుండా తెలుగువారిని సైతం తనకు ఫ్యాన్స్ గా మార్చుకున్నాడు. ఇక ఈ సినిమాతో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ను మొదలుపెట్టాడు.  ఈ LCU  లో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చాయి. 

 

 కేవలం సినిమాలకు దర్శకత్వం వహించడమే కాకుండా  ఒక కొత్త ప్రొడక్షన్ బ్యానర్ ను మొదలుపెట్టి అందులో సినిమాలను నిర్మిస్తున్నాడు. అలా  లోకేష్ నిర్మిస్తున్న చిత్రం బెంజ్(Benz). రాఘవ లారెన్స్(Raghava Lawrence), నివిన్ పౌలి(Nivin Pauly) నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక లోకేష్.. డైరెక్టర్ గా, నిర్మాతగానే  కాకుండా హీరోగా కుండా ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమయ్యాడు. ఇప్పటికే లోకేష్, శృతి హాసన్ కలిసి ఇనిమేల్ అనే మ్యూజిక్ ఆల్బమ్ లో నటించారు. అప్పటినుంచే లోకేష్ హీరోగా చేస్తే బావుంటుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేశారు. ఇక ఫ్యాన్స్ కోరికను లోకేష్ నెరవేరుస్తున్నాడు.

 

Happy Birthday: ఫెస్టివల్స్ తో శ్రీలీలకు ఫెవికాల్ బంధం

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం లోకేష్ హీరోగా  తెరకెక్కుతున్న చిత్రానికి అరుణ్ మత్తేశ్వరన్(Arun Matheswaran) దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం. కెప్టెన్ మిల్లర్(Captain Miller) సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న అరుణ్ మత్తేశ్వరన్ చెప్పిన కథ లోకేష్ కు బాగా నచ్చడంతో వెంటనే సెట్స్ మీదకు తీసుకెళ్లారని టాక్ వినిపిస్తుంది. యాక్షన్ ఎంటర్ టైనర్  గా తెరకెక్కే ఈ సినిమా కోసం  లోకేష్ చాలా కష్టపడుతున్నాడని, యాక్షన్ సీక్వెన్స్ కోసం మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ కూడా తీసుకుంటున్నాడని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. త్వరలోనే లోకేష్ ఎంట్రీకి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. మరి  డైరెక్టర్ గా సక్సెస్ అయిన లోకేష్ హీరోగా కూడా సక్సెస్ అవుతాడా .. ? అనేది చూడాలి. 

Updated Date - Jun 14 , 2025 | 03:02 PM