సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Mrunal Thakur: ధనుష్ తో రిలేషన్.. ఎట్టకేలకు ఓపెన్ అయిన మృణాల్

ABN, Publish Date - Aug 11 , 2025 | 09:50 PM

ఇండస్ట్రీలో రూమర్స్ నీటి మీద గీతలాంటివి.గీసినంత సేపు ఉండవు. ఒక హీరో హీరోయిన్ కలిసి కనిపిస్తే చాలు వారిద్దరి మధ్య ఏదో ఉందని చెప్పుకొచ్చేస్తారు. ఇక గత కొన్నిరోజుల నుంచి బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur), ధనుష్(Dhanush) మధ్య రిలేషన్ ఉందని వార్తలు వినిపిస్తున్న విషయం తెల్సిందే.

Dhanush

Mrunal Thakur: ఇండస్ట్రీలో రూమర్స్ నీటి మీద గీతలాంటివి.గీసినంత సేపు ఉండవు. ఒక హీరో హీరోయిన్ కలిసి కనిపిస్తే చాలు వారిద్దరి మధ్య ఏదో ఉందని చెప్పుకొచ్చేస్తారు. ఇక గత కొన్నిరోజుల నుంచి బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur), ధనుష్(Dhanush) మధ్య రిలేషన్ ఉందని వార్తలు వినిపిస్తున్న విషయం తెల్సిందే. మృణాల్ పుట్టినరోజు వేడుకల్లో ధనుష్ హైలైట్ గా నిలిచాడు. అసలు ఒక్క సినిమా కూడా చేయకుండా వీరిద్దరి మధ్య పరిచయం ఎలా ఏర్పడింది.. అది ప్రేమగా ఎలా మారింది అనే అనుమానాలు తలెత్తాయి.


ఇక సన్నాఫ్ సర్దార్ 2 సినిమా ఈవెంట్ లో కూడా ధనుష్ ఉండడంతో మృణాల్ కోసమే వచ్చాడని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఈమధ్య ఇడ్లీ కడై సినిమాలో ధనుష్ సాంగ్ ను మృణాల్ పాడడం ఈ ప్రేమ వార్తలకు మరింత ఆజ్యం పోసింది. దీంతో నిజంగానే వీరిద్దరి మధ్య ఏదో ఉందని మాట్లాడుకున్నారు. సరే రూమర్స్ వచ్చిన వెంటనే ధనుష్ కానీ, మృణాల్ కానీ స్పందిస్తారేమో అనుకున్నారు. కానీ అది కూడా జరగలేదు.


ఇక ఎట్టకేలకు మృణాల్ ఈ వార్తలపై స్పందించింది. ధనుష్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని, అతను తనకు స్నేహితుడు మాత్రమే అని చెప్పుకొచ్చింది. ' ధనుష్ నాకు మంచి ఫ్రెండ్. ఈ రూమర్స్ నాకు తెలుసు. కానీ, నేనే ఎక్కువ పట్టించుకోలేదు. సన్నాఫ్ సర్దార్ 2 ఈవెంట్ కు ధనుష్ వచ్చింది అజయ్ దేవగణ్ కోసమే. వారిద్దరూ మంచి ఫ్రెండ్స్. ఆయన పిలిస్తేనే ధనుష్ వచ్చాడు. మేము ఇద్దరం కలిసి కనిపించనంత మాత్రాన మా మధ్య ఏదో ఉన్నట్లు అనుకోకండి' అని చెప్పుకొచ్చింది. దీంతో వీరిద్దరి మధ్య రిలేషన్ కు చెక్ పడినట్లే అని చెప్పొచ్చు.

Sundarakanda: ఏజ్ బార్ పెళ్లి కొడుకు కష్టాలు.. నారా వారబ్బాయి హిట్ కొట్టేలా ఉన్నాడే

War 2: ప్రీ రిలీజ్ ఈవెంట్ ఖర్చే అన్ని కోట్లా..

Updated Date - Aug 11 , 2025 | 09:50 PM