Sundarakanda: ఏజ్ బార్ పెళ్లి కొడుకు కష్టాలు.. నారా వారబ్బాయి హిట్ కొట్టేలా ఉన్నాడే
ABN , Publish Date - Aug 11 , 2025 | 08:40 PM
టాలీవుడ్ కుర్ర హీరోల్లో మంచి విజయం కోసం ఎదురుచూస్తున్నవారిలో నారా రోహిత్ (Nara Rohith) ఒకడు. నారావారి వారసుడుగా ఇండస్ట్రీకి పరిచయమైనా.. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు కోసం ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నాడు.
Sundarakanda: టాలీవుడ్ కుర్ర హీరోల్లో మంచి విజయం కోసం ఎదురుచూస్తున్నవారిలో నారా రోహిత్ (Nara Rohith) ఒకడు. నారావారి వారసుడుగా ఇండస్ట్రీకి పరిచయమైనా.. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు కోసం ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నాడు. ఒక సినిమా కాకపోతే ఒక సినిమా.. అది కాకపోతే ఇంకొకటి అంటూ ఎంతో ఓపికగా హిట్ కోసం ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నాడు. ఈ ఏడాది భైరవం(Bhiravam) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నారా రోహిత్. ఉన్నది కొద్దిసేపే అయినా కూడా చాలా సెటిల్డ్ గా చేశాడనే పేరును తెచ్చుకొని మంచి మార్కులు కొట్టేశాడు.
ఇక ప్రస్తుతం నారా రోహిత్ హీరోగా నటిస్తున్న చిత్రం సుందరకాండ. వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో నారా రోహిత్ సరసన శ్రీదేవి విజయ్ కుమార్, వ్రితి వఘ్ని హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈశ్వర్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన శ్రీదేవి.. చాలాకాలం తరువాత ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆగస్టు 27 న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది.
ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ వేగాన్ని పెంచిన మేకర్స్ తాజాగా సుందరకాండ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైన్మెంట్ గా తెరకెక్కిందని ట్రైలర్ చూస్తుంటే అర్దమవుతుంది. సిద్దార్థ్.. పెళ్లి కోసం ఆరాటపడే ఒక యువకుడు. వయస్సు పెరుగుతున్నా గ్రహాలు అనుకూలించక పెళ్లి కాకుండా ఉండిపోతాడు. అయితే అతనికి పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలో 5 లక్షణాలు ఉండాలి. అవి ఉన్న అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని మంకు పట్టుకొని వెతుకుతూ ఉంటాడు. ఆ నేపథ్యంలోనే సిద్దు.. తనకంటే పెద్ద అమ్మాయిని..తనకంటే చిన్న అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ కొన్ని కారణాల వలన ఈ రెండు ప్రేమలు దూరమవుతాయి. మరి ఆ కారణాలు ఏంటి .. ? ఏజ్ బార్ సిద్దార్థ్ చివరకు పెళ్లి కొడుకు అవుతాడా.. ? ఆ ఇద్దరు అమ్మాయిల్లో సిద్దు ప్రేమించింది ఎవరు.. ? అనేది తెలియాలంటే సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ట్రైలర్ మొత్తం చాలా అద్భుతంగా కట్ చేశారు. ఫుల్ కామెడీతో పాటు ఒక మంచి మెసేజ్ ను చూపించబోతున్నారని అర్ధమవుతుంది. నారా రోహిత్ చాలా న్యూ లుక్ తో కనిపించాడు. ఇక శ్రీదేవి విజయ్ కుమార్ రీఎంట్రీ ఈ సినిమాకు ప్లస్ కానుందని అంటున్నారు. ఇక కమెడియన్స్ సత్య, నరేష్, అభినవ్ గోమటం, వాసుకి ఇలా చాలామంది అందరికీ తెల్సిన ముఖాలు ఉండడంతో సినిమాపై పాజిటివ్ టాక్ వచ్చేసింది. లియోన్ జేమ్స్ మ్యూజిక్ కూడా చాలా ఫ్రెష్ గా అనిపిస్తుందని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. మరి ఈ సినిమాతో నారా రోహిత్ హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.
War 2: ప్రీ రిలీజ్ ఈవెంట్ ఖర్చే అన్ని కోట్లా..
Shyamala Devi: ప్రభాస్ పెళ్లి.. ఆ శుభ సమయం రానుంది